E-Paper
Advertisement

Samantha: సిటాడెల్ కోసం సమంత అంత అందుకుందా.. మరీ ఇంత కాస్ట్లీనా.. ?

Samantha: సిటాడెల్ కోసం సమంత అంత అందుకుందా.. మరీ ఇంత కాస్ట్లీనా.. ?
Advertisement

Samantha: స్టార్ హీరోయిన్ సమంత మరోసారి రికార్డ్ సృష్టించడానికి రెడీ అయ్యింది. అమ్మడు సినిమాలు చేసినా వార్తనే.. చేయకపోయినా వార్తనే. అసలు చెప్పాలంటే సమంత ఏం చేసినా.. చేయకపోయినా అది ఒక ట్రెండ్ గా మారిపోతుంది. ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమాలతో బిజీగా మారింది. మా ఇంటి బంగారం అనే సినిమా ఒకటి చేస్తున్న సామ్.. ఇది కాకుండా దళపతి 69లో నటిస్తుందని టాక్.

ఇక ఇప్పటికే సామ్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి యాక్షన్ వెబ్ సిరీస్ లతో స్టార్ డైరెక్టర్స్ గా మారిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. హాలీవుడ్ రూస్సో బ్రదర్స్ తెరకెక్కించిన సిటాడెల్ కు ఇది రీమేక్ గా తెరకెక్కింది. అందులో ప్రియాంక చోప్రా, రిచర్డ్ నటించిన పాత్రల్లో సమంత, వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నవంబర్ 7 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

ఇక ఈ సిరీస్ కోసం సామ్ చాలా కష్టపడింది. యాక్షన్ సన్నివేశాల కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. అయితే ఆ కష్టానికి తగ్గా పారితోషికం కూడా అందుకుందని టాక్. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోయిన్ అందుకోని టాప్ రెమ్యూనరేషన్ సామ్.. ఈ సిరీస్ కోసం అందుకుందట. ఇలాంటి రేర్ రికార్డులు అందుకోవడం సామ్ కు కొత్తేమి కాదు. తెలుగులో కోటి రూపాయలు అందుకున్న మొదటి హీరోయిన్ సమంతనే.

ఇక ఇప్పుడు సిటాడెల్ హనీ బన్నీ కోసం సమంత అక్షరాలా రూ.10 కోట్లు తీసుకుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇది తక్కువ అమౌంట్ కాదు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ హిట్ తరువాత సామ్ అమాంతం పారితోషికం పెంచేసిందట. ఇప్పటివరకు తెలుగులో ఏ హీరోయిన్ రూ. 5 కోట్ల మార్క్ వరకు కూడా వచ్చింది లేదు. బాలీవుడ్ లో ప్రియాంక, దీపికా మాత్రమే రూ.10 కోట్ల మార్క్ ను టచ్ చేశారు. ఇక ఇప్పుడు సామ్ ఆ మార్క్ ను టచ్ చేసింది. ఇక నుంచి ఆమె బాలీవుడ్ లోనే కాదు ప్రతి సినిమాకు అంతే రేటును చెప్పనుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×