BigTV English

Heavy Rains: అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Heavy Rains: అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Weather Update: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు(మంగళవారం) 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అలర్ట్ చేసింది. కాగా, రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదనీ హెచ్చరికలు పంపింది. రాష్ట్రం మీద ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించింది.


ఈ రోజు నల్గొండ, సూర్యపేట్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణం, తేలికాపటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, అందుకే మరో రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్స్ జారీ చేసినట్టు ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం – ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టు పేర్కొంది.


Also Read: రైతులకు గుడ్ న్యూస్.. మూడో విడత రుణమాఫీ తేదీ వెల్లడించిన మంత్రి

ఇక ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అధికారులు వెల్లడించారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×