E-Paper
Advertisement

Samantha: 600 మెట్లు.. మెట్టు మెట్టుకు సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే?

Samantha: 600 మెట్లు.. మెట్టు మెట్టుకు సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే?
Advertisement

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నాగచైతన్యతో విడిపోయాక పూర్తిగా సినిమాలు, కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో అనుకోకుండా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. దాదాపు 8 నెలలుగా ఆ వ్యాధితో పోరాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తిరిగి సినిమాలపై ఫోకస్ పెడుతోంది.

ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. హాట్ సమ్మర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు కానుంది. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ మూవీలో సామ్ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ 60శాతం కంప్లీట్ అయింది.

Advertisement

తాజాగా సామ్ తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కొండ కింది నుంచి ఆలయం వరకు సుమారు 600 మెట్లకు హారతి వెలిగించి మొక్కులు తీర్చుకుంది. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే తన ఆరోగ్యం కోలుకోవడంతో సామ్ ఇలా మొక్కులు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×