E-Paper
Advertisement

Inhibit Covid:కోవిడ్ నుండి కాపాడే చెట్లు.. పరిశోధనలు మొదలు..

Inhibit Covid:కోవిడ్ నుండి కాపాడే చెట్లు.. పరిశోధనలు మొదలు..
Advertisement

Inhibit Covid:కోవిడ్ 19 ఒకేసారి ప్రపంచాన్ని కమ్మేసిన సమయంలో.. శాస్త్రవేత్తలకు, వైద్యులకు.. మనుషుల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక రీసెర్చ్ గ్రూప్.. అసలు ఈ కోవిడ్ అనేది ఎందుకు వచ్చింది అనేదానిపై పరిశోధనలు చేస్తుంటే.. మరో రీసెర్చ్ గ్రూప్ మాత్రం దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడంలో నిమగ్నమయ్యారు. వ్యాక్సిన్ అనేది వచ్చి కోవిడ్ బారినుండి కొందరిని బయటపడేయడంతో ఇప్పుడు మరో కోణంలో పరిశోధనలు మొదలయ్యాయి.

కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధనలతో బిజీగా ఉన్నారు. తాజాగా శరీరంలో పెరిగే ఓ ప్రొటీన్.. కోవిడ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఇప్పుడు మరో విషయాన్ని గమనించారు. రెండు రకాల చెట్ల వల్ల కోవిడ్‌ను నిరోధిస్తుందని ఒక అమెరికా స్టడీలో తేలింది. ఆ రెండు చెట్లు.. టాల్ గోల్డెన్‌రాడ్, ఈగల్ ఫెర్న్. ఈ రెండు సార్స్ కోవిడ్ 2ను మనిషి శరీరంలోని సెల్స్‌లోకి రాకుండా నిరోధించడం శాస్త్రవేత్తలు గమనించారు. ఈ రెండు చెట్లలోని పువ్వులు, వేర్లలో అతి తక్కువ మోతాదులో కోవిడ్‌ను అరికట్టే సామర్థ్యం ఉందని వారు చెప్తున్నారు.

Advertisement

అమెరికా చేసిన ఈ పరిశోధనలను జార్జియా ఖండించింది. మహమ్మారి వ్యాధులకు ఇలాంటి చెట్లతో చికిత్స అందించడం చాలా ప్రమాదకరమని వారు విమర్శించారు. ముఖ్యంగా ఈగల్ ఫెర్న్ అనే చెట్టు చాలా ప్రమాదకరమైనదని వారు అన్నారు. కానీ జార్జియా విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా అమెరికా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆ చెట్లలోని అణువులను తెచ్చి ఐసోలేట్ చేసి.. పరిశోధనలను ప్రారంభించారు అక్కడి శాస్త్రవేత్తలు.

ప్రస్తుతం ఐసోలేట్ చేసిన అణువులను టెస్ట్ చేసి.. కోవిడ్ 19కు మందులుగా ఎలా పనిచేస్తాయో అన్నదానిపై పరిశోధనలు జరగనున్నాయి. కోవిడ్ అనేది మహమ్మారి వైరస్‌లాగా మానవాళిని ఇబ్బంది పెట్టడంతో.. దానిపై మరొకొన్ని పరిశోధనలు చేసి.. ఆపై ఈ చెట్లు దాని నివారణకు ఎలా తోడ్పడతాయో తెలుసుకోనున్నారు. అల్ఫా, తీట, డెల్టా, గామా లాంటి నాలుగు రకాల సార్స్ కోవిడ్ 2 వైరస్‌లపై ఈ చెట్లు పనిచేస్తాయని వారు తెలిపారు. భవిష్యత్తులో రానున్న ఎన్నో వ్యాధులకు నేచురల్‌గా పరిష్కారాలు కనుక్కోవడానికి.. ఇది తొలిమెట్టు అని శాస్త్రవేత్తలు హామీ ఇచ్చారు.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×