Samantha wants to give return gift to naga Chaitanya by her marriage: ఏం మాయ చేశావే తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. మాతృభాష మలయాళమే అయినా పదహారణాల తెలుగమ్మాయిలా ఉన్న సమంతను తెలుగు ప్రేక్షకులు తమ సొంత కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారు. అందుకే ఆమె అగ్ర హీరోలందరితో చేసిని సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, విజయ్ దేవరకొండతో చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందించి సమంత కెరీర్ గ్రాఫ్ ను ఒక్కసారిగా పెంచేశాయి. ఇక నాగచైతన్యతో చేసిన సినిమాలు దాదాపు అన్నీ సక్సెస్ కావడంతో ఈ జంట సూపర్ హిట్ పెయిర్ గా ప్రశంసలు అందుకున్నారు. అదే సమయంలో ఇద్దరూ ప్రేమలో పడటం..అక్కినేని ఫ్యామిలీ అందుకు ఆమోదం తెలపడం అన్నీ జరిగిపోయాయి. అయితే కొన్ని కారణాంతరాల వలన ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత సమంత మానసికంగా, శారీరకంగా అనారోగ్యం పాలయింది. అందుకే సినిమాలు సైతం తగ్గించుకుంది.
ట్విస్ట్ ఇచ్చిన నాగ్ ఫ్యామిలీ
ఇద్దరూ అదిగో కలిసిపోతున్నారు..ఇదిగో అంటూ చైతన్య, సమంతలపై రోజుకో వార్త వచ్చింది. ఇంతలోనే సడన్ గా శోభితతో చైతూ నిశ్చితార్థం అంటూ నాగార్జున ట్విట్టర్ లో ప్రకటించేసరికి అందరూ అవాక్కయ్యారు. ముఖ్యంగా సమంత కూడా ఊహించి ఉండదు. అయితే సామ్ అభిమానులైతే సమంతపై సానుభూతి చూపిస్తున్నారు. అయితే సమంత కూడా దీనిపై ఏ రకమైన స్పందనా తెలియజేయలేదు. కామ్ గా ఉందని అనుకుంటున్నారంతా. సమంత కూడా చైతూపై ఎలాగైనా కసి తీర్చుకోవాలని అనుకుంటోందని వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంతో తెలియదు గానీ సమంత కొంత కాలంగా తనతో మూవీ తీసిన ఓ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో పడిందట.
అందుకేనా విడిపోయింది
ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించిన సమంతకు మంచి పేరు వచ్చింది. అయితే ఆ సిరీస్ లో ఆమె చాలా బోల్డ్ గా ఓ సన్నివేశంలో నటించింది. అసలు సమంత, చైతూల మధ్య దూరం పెరగడానికి ఈ బోల్డ్ సీన్లే కారణం అని అంటారు. ఇలాంటి సన్నివేశాలు చేస్తున్నప్పుడు కనీసం చైతూను గానీ, నాగార్జునను గానీ సంప్రదించలేదట సమంత. అందుకే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అంటారు. అవన్నీ పక్కన పెడితే ది ఫ్యామిలీ మ్యాన్ 1, 2 వెబ్ సిరీస్ ను తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు రాజు నిడుమోరు. రాజ్ అండ్ డీకే కలయికలో వచ్చిన రెండు సిరీస్ లూ అద్భుత విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఇదే కలయికలో మూడో సిరీస్ కూడా నిర్మితమవుతోంది. ఇందులో కూడా సమంత హీరోయిన్. అయితే ఇటీవల ఓ దర్శకుడితో సమంత పీకల్లోతు ప్రేమలో పడిపోయిందని టాక్ నడుస్తోంది.
ఆ దర్శకుడిని ఇష్టపడుతోందా?
నాగచైతన్య ఎంగేజ్ మెంట్ కావడంతో సమంత ఆ దర్శకుడిపై ఒత్తిడి తెస్తోందని సమాచారం. సదరు ఆ దర్శకుడికి కూడా వివాహం అయిందట. ఇప్పుడు సమంతను చేసుకోవాల్సి వస్తే మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఆ దర్శకుడు రెడీ అవుతున్నాడని సమాచారం. సమంత, ఆ డైరెక్టర్ ల ఎంగేజ్ మెంట్ కూడా అనధికారికంగా అయిపోయిందని కొందరు అంటున్నారు. ఇప్పుడు సమంత ఆ దర్శకుడిని పెళ్లిచేసుకుంటే అక్కినేని ఫ్యామిలీకి టిట్ ఫర్ టాట్ అంటూ దెబ్బకు దెబ్బ కొట్టినట్లవుతుందని సమంత భావిస్తోందట. సమంత అభిమానులు మాత్రం ఈ విషయంలో తగ్గొద్దని..చైతూకు గుణపాఠం చెప్పాలని సమంతను ఎంకరేజ్ చేస్తున్నారు.