Rajasthan Viral video: ఈ మధ్యకాలంలో దారుణమైన ఘటనలు రాజస్థాన్‌లో చోటు చేసుకుంటా యి. నాగౌర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కాకపోతే ఇప్పటివరకు బాధితురాలు ఫిర్యాదు చేయలేదు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
నాగౌర్ జిల్లాలోని నహర్‌సింగ్ పుర గ్రామంలో ప్రేమ్‌రామ్ మేఘవాల్ దంపతులు ఉంటున్నారు. ఆరునెలల కిందట మ్యారేజ్ అయ్యింది. మేఘవాల్ కు అత్తింటివారితో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. ఆ సంగతి పక్కనబెడితే జైసల్మేర్‌లో తన సోదరి ఇంటికి వెళ్తానని భర్తతో చెప్పిందామె. అందుకు అతగాడు ససేమిరా అన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.
పట్టరాని కోపంతో లిక్కర్ షాపుకి వెళ్లాడు మేఘవాల్. మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత భార్యపై దాడి చేసి కాళ్లను కట్టేశాడు. ఆ తర్వాత టూ వీలర్స్ వెనుక కట్టి తన గ్రామానికి ఈడ్చుకెళ్లాడు. కడుపు నొప్పితో ఆ మహిళ బాధపడుతూ సాయం కోసం అరిచింది. అసలే పల్లెలూరు.. అందులోనూ ఫ్యామిలీ వ్యవహారం ఎవరూ జోక్యం చేసుకోలేదు.
ALSO READ: ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
అదే రూట్లో ఓ మహిళ వెళ్తోంది. ఆమె కూడా పట్టించుకోలేదు. ఇక ఈ తతంగాన్ని ఓ వ్యక్తి చిత్రీకరిస్తున్నా డు. అతడు సైతం రియాక్ట్ కాలేదు సరికదా, మేఘవాల్‌కు మద్దతుగా నిలిచాడు. చివరకు ఇంటికి తీసు కొచ్చాడు. ఊరిలో వ్యక్తులు సైతం నోరెత్తలేదు. ఈ ఘటన గత నెల జరిగింది.
తాజాగా ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు రియాక్ట్ అయ్యారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితు రాలు పంజాబ్‌లో తన తల్లి వద్ద ఉంటోంది. ఇంత చేసినా భర్తపై కనీసం పోలీసు లకు ఫిర్యాదు చేయలేదు ఆ ఇల్లాలు.
https://twitter.com/IsrarNchaudhary/status/1823298750694986146