E-Paper
Advertisement

Sandeep Reddy Vanga:- ‘యానిమల్’ పూర్తి చేసిన ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్

Sandeep Reddy Vanga:- ‘యానిమల్’ పూర్తి చేసిన ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్

Sandeep Reddy Vanga:- అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగులో.. దాన్నే హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లో యానిమల్ సినిమా చేస్తున్నారు. రణ్‌భీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇన్‌టెన్స్ మూవీగా తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్‌తో ఆ విషయం తెలుస్తుంది. తాజాగా లండన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలతో షూటింగ్‌ను పూర్తి చేశారు మేకర్స్. హీరో రణ్‌భీర్ సహా టీమ్ కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ చిత్రాన్ని హిందీతో సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

యానిమల్‌లో రణ్‌భీర్ కపూర్‌కి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగా సినిమాలపై ఆడియెన్స్‌లో ఆసక్తి పెరిగింది. దీంతో ఇప్పుడు రాబోతున్న యానిమల్‌పై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు లవ్ అనే ఎమోషన్‌పై బ్లాక్ బస్టర్ సాధించిన సందీప్.. యానిమల్‌లో తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్‌ను చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉన్నాయి. అందులో ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలను కూడా టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్‌తో కలిసి సందీప్ రూపొందిస్తున్నారు. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×