BigTV English

Karthikeya:- కార్తికేయ రాజమౌళిని ఏమని పిలుస్తాడో తెలుసా!

Karthikeya:- కార్తికేయ రాజమౌళిని ఏమని పిలుస్తాడో తెలుసా!

Karthikeya:- దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి గురించి వారి తనయుడు కార్తికేయ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. విషయమేమంటే కార్తికేయ, రాజమౌళి అసలు కొడుకు కాదు. రమకి అంతకు ముందే పెళ్లైంది. కొన్ని కారణాలతో అతన్నుంచి ఆమె విడిపోయింది. ఆ తర్వాత రాజమౌళి, రమకు మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూ కార్తికేయ చెప్పారు. రాజమౌళిని తమ జీవితంలోకి ఆహ్వానించేటప్పుడు ఏం జరిగింది? అనే విషయాన్ని చెప్పింది. ‘‘నాకు 8 ఏళ్లు ఉన్నప్పటి నుంచి రాజమౌళి మా ఇంటికి వస్తున్నారు. సీరియల్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పుడు మమ్మల్నే రమ్మని ఫోన్ చేసేవాడు. అమ్మను పెళ్లికి చేసుకోవటానికి ముందే రాజమౌళిలో నేను తండ్రిని చూశాను. వారి పెళ్లి జరిగినప్పుడు చాలా ఆనందమేసింది. నేను తనను నాన్న అని పిలవటం కంటే బాబా అని పిలుస్తాను. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది’’ అన్నారు కార్తికేయ.


RRR చిత్రానికి సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు కార్తికేయ. అంతే కాకుండా ఈ చిత్రానికి ఆస్కార్ రావటంతో తనదైన పాత్రను పోషించారు. యు.ఎస్‌లో ప్రత్యేకమై షోస్‌ను వేసి ట్రిపులార్ చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం ద్వారా సినిమాను ఆస్కార్ బరిలోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు ఆస్కార్ రావటానికి రూ.80 కోట్లు ఖర్చు పెట్టారనే దానిపై కూడా ఈ ఇంటర్వ్యూలో కార్తికేయ రియాక్ట్ అయ్యారు. అందరూ అనుకున్నట్లు ఎనబై కోట్లు ఖర్చు కాలేదని, ప్రమోషన్స్ కోసం ఎనిమిది కోట్లు ఖర్చు అయ్యిందని అన్నారు.

నెక్ట్స్ మూవీని మహేష్‌తో చేయబోతున్నారు రాజమౌళి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కనుంది. ఈ ఏడాదిలో ప్రాజెక్ట్‌ని లాంచనంగా ప్రకటించి, నెక్ట్స్ ఇయర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×