E-Paper
Advertisement

Sankranthiki Vasthunnam: “గోదారి గట్టు” పాట కోసం రమణ గోగుల రెమ్యునరేషన్ ఎంతంటే..?

Sankranthiki Vasthunnam: “గోదారి గట్టు” పాట కోసం రమణ గోగుల రెమ్యునరేషన్ ఎంతంటే..?
Advertisement

విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, అనిల్ రావిపూడి(Anil Ravipudi)కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి అటు ఓటీటీ డీల్ కానీ ఇటు శాటిలైట్ హక్కులను కానీ కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. మరొక హీరోయిన్ గా మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary)నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఐశ్వర్య, వెంకటేష్ పై చిత్రీకరించిన “గోదారి గట్టు” పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాట విపరీతమైన క్రేజ్ ను కూడా అందుకుంది. ముఖ్యంగా ప్రముఖ సింగర్ రమణ గోగుల(Ramana Gogula) ఈ పాటను ఆలపించారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ లో ఈ పాట బాగా ట్రెండ్ అవుతుండగా.. ముఖ్యంగా రీల్స్ చేస్తూ అటు సెలబ్రిటీలు కూడా పాటను మరింత పాపులర్ చేస్తున్నారు.

రీ ఎంట్రీలో బ్లాక్ బాస్టర్..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఈ పాట పాడడం కోసం ప్రముఖ సింగర్ రమణ గోగుల ఎంత పారితోషకం తీసుకున్నారు అనే విషయం వైరల్ గా మారుతోంది. రమణ గోగుల చిన్నతనంలోనే తన అద్భుతమైన గాత్రంతో అశేష ప్రేక్షభిమానం పొందారు.ఈయన అప్పట్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలకు పాటలు పాడేవారు. ఈయన పాడితే అచ్చం పవన్ కళ్యాణ్ పాడినట్టే ఉండేది. అటు ఆడియన్స్, ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ తన పాటలను తానే పాడుకునేవాడు అని అనుకునేవారు. ఆ రేంజ్ లో ఆయన పాటలు పాడేవారు. కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు ప్రభాస్, వెంకటేష్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా పాటలు కూడా పాడారు. ఇక అప్పట్లో ఆయన పాడిన అన్ని పాటలు కూడా సెన్సేషనల్ హిట్ అయ్యాయి.

“గోదారి గట్టుమీద” పాట కోసం రమణ గోగుల రెమ్యునరేషన్..

Advertisement

అయితే ఏమైందో తెలియదు కానీ.. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే ఈయన గొంతును మళ్లీ ఆడియన్స్ కి వినిపించాలనుకున్న అనిల్, వెంకటేష్ ఈయనను పట్టుబట్టి మరీ “గోదారి గట్టుమీద” అనే పాటను పాటించారట. ఇక ఈ సాంగ్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. రెండు వారాల క్రితం విడుదలైన ఈ పాటకి యూట్యూబ్లో 28 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఈ రేంజ్ లో పాపులారిటీ అందుకున్న ఈ పాట కోసం ఆయన ఎంత తీసుకొని ఉంటారో అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తుండగా.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. రమణ గోగుల వెంకటేష్ మీద ఉన్న అభిమానంతోనే రెమ్యునరేషన్ తీసుకోలేదట. ఇక నిర్మాత దిల్ రాజ్ కి కేవలం ఆయనను అమెరికా నుండి రప్పించడానికి టికెట్ ఖర్చులు, హోటల్లో ఉండడానికి అయ్యే ఖర్చులు తప్ప రమణ గోగుల ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. ఇకపోతే ఈ పాటతో రమణ గోగుల రీయంట్రీ ఇచ్చారని , పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమా కోసం కూడా పాట పాడాలని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. పవన్ అభిమానుల రిక్వెస్ట్ మేరకు పాట పాడుతారేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×