E-Paper
Advertisement

Couple Friendly: కపుల్ ఫ్రెండ్లీ అంటున్న సంతోష్ శోభన్.. లక్ అంటే మనోడిదే

Couple Friendly: కపుల్ ఫ్రెండ్లీ అంటున్న సంతోష్ శోభన్.. లక్ అంటే మనోడిదే
Advertisement

Couple Friendly: యంగ్ హీరో సంతోష్ శోభన్.. చాలాకాలంగా ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే. పెద్ద పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేస్తున్నా కూడా సంతోష్ కు గట్టి సినిమా పడలేదు. గతేడాది అన్ని మంచి శకునములే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

తాజాగా మరో సినిమాను కూడా పట్టాలెక్కించాడు. సంతోష్ శోభన్ హీరోగా అశ్విన్ చంద్రశేఖర్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఆమె దేవకీ వాసునందన అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా రిలీజ్ కాకముందే రెండో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

Advertisement

నేడు ఈ హీరో పుట్టినరోజు కావడంతో.. టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి సంతోష్ శోభన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఈ గ్లింప్స్ లో సంతోష్ శోభన్ ఒక మిడిల్ క్లాస్ యువకుడిగా కనిపించాడు. డాబా పైన పడుకొని లేవడం, కిందకు వచ్చి కిచెన్ లో దోసలు తినడం చూపించారు. ఇక చివర్లో రెండు టీలను ఇద్దరు పట్టుకొని ఉన్నప్పుడు కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ ను రివీల్ చేస్తూ సంతోష్ శోభన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇకపోతే యూవీలో మూడోసారి నటిస్తున్న హీరోగా సంతోష్ కు గుర్తింపు దక్కింది. ఇప్పటికే యూవీలోనే ఏక్ మినీ కథ, కళ్యాణం కమనీయం లాంటి సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ అంటున్నాడు. యూవీలో ముచ్చటగా మూడోసారి ఆఫర్ పట్టాడంటే.. అదృష్టమే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా సంతోష్ శోభన్ మంచి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×