Saripodhaa Sanivaaram: టాలీవుడ్ లో క్లాస్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక అలాంటి కథలను తీయడంలో తెలుగు డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అందులో ఒకరు వివేక్ ఆత్రేయ. మెంటల్ మదిలో అనే సినిమాతో వివేక్ ఆత్రేయ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా తరువాత బ్రోచేవారెవరురా సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. ఇక న్యాచురల్ స్టార్ నానితో అంటే సుందరానికీ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా ఈ సినిమాకు అంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ నే అందించింది. నిజం చెప్పాలంటే వివేక్ ఆత్రేయ సినిమాలో వైలెన్స్ కు తావే ఉండదు. అందుకు ఈ మూడు సినిమాలే ఉదాహరణ.
కానీ, ఒక డైరెక్టర్ తలుచుకుంటే క్లాస్ సినిమా తీయొచ్చు.. అంతకుమించిన మాస్ సినిమా కూడా తీయొచ్చు అని వివేక్ ఆత్రేయ.. సరిపోదా శనివారం సినిమాతో నిరూపించాడు. నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా సరిపోదా శనివారం. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. ఎస్ జె సూర్య విలన్ గా కనిపిస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూసాక.. అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు నాని నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నాని- సూర్య మధ్య యాక్షన్ సీన్స్ అయితే థియేటర్ లో విజిల్స్ కన్ఫర్మ్ అని చెప్తున్నాయి. అసలు వివేక్ ఆత్రేయ నుంచి ఇలాంటి ఒక మాస్ సినిమాను ఊహించి ఉండరుకూడా. ట్రైలర్ తరువాత సినిమాపై అంచనాలు మరింత పెంచేసాయి. ఆగస్టు 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నాని- వివేక్ ఆత్రేయ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.