E-Paper
Advertisement

Senthil Kumar: బ్రేకింగ్.. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఇంట తీవ్ర విషాదం

Senthil Kumar: బ్రేకింగ్.. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఇంట తీవ్ర విషాదం
Advertisement

Senthil Kumar: టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెంథిల్ తల్లి.. ఈరోజు ఉదయమే మృతిచెందినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొద్దిసేపటి క్రితమే శ్రీనగర్ కాలనీలోని స్వంత గృహంలో  కన్నుమూశారు. దీంతో సెంథిల్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఇక ఈ విషయం తెలియడంతో స్వయంభు షూటింగ్ లో ఉన్న సెంథిల్.. హుటాహుటినా ఇంటికి చేరుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సెంథిల్ భార్య రూహీ కన్నుమూసింది. COVID-19 వచ్చినప్పటి నుండి రూహీకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అవి ఎక్కువ కావడంతోనే రూహీ మరణించినట్లు సెంథిల్ తెలిపారు.

Advertisement

ఇక భార్య మరణం తరువాత కొన్నిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సెంథిల్.. ఈ మధ్యనే స్వయంభు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక ఈ సమయంలోనే ఆయన తల్లి కూడా మరణించడం ఎంతో విషాదకరం. ఇక సెంథిల్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాజమౌళి ఆస్థాన డీవోపీగా సెంథిల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సై’, ‘ఛత్రపతి’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి సినిమాలకు సెంథిల్.. డీవోపీగా పనిచేశారు. ఒకే ఏడాదిలోనే సెంథిల్.. భార్యను, తల్లిని పోగొట్టుకోవడం చాలా విషాదమని, ఆయనకు దేవుడు ధైర్యాన్ని అందించాలని పలువురు ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×