BigTV English

 Flax Seeds Benefits: అవిసె గింజలతో ఫేస్‌ ప్యాక్‌.. ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం..

 Flax Seeds Benefits: అవిసె గింజలతో ఫేస్‌ ప్యాక్‌.. ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం..

Flax Seeds Benefits For Skin And Hair: అవిసె గింజలతో ఆరోగ్యమో కాదు.. చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అవిసె గింజలలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే గుణాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వర్షాకాలంలో కలిగే చర్మ సమస్యలు, మొటిమలు సమస్య, దురద వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ నుండి తయారు చేసిన ఫేస్ ప్యాక్ లు ప్రభావంవంతంగా పనిచేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది చర్మం మెరుపును పెంచడమే కాకుండా వృద్ధాప్య సమస్య నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ చర్మాన్ని ఎలా రక్షిస్తాయో ఓ సారి చూసేద్దాం..


అవిసె గింజలు చర్మాన్ని ఎలా రక్షణ ఇస్తాయి.

అవిసె గింజలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ప్రొటీన్ అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే ఫాటీ ఆసిడ్ లు చర్మం స్థితిస్థాపకతను పెంచుతాయి. అవిసె గింజలు పొడిని ముఖానికి రాసుకుంటే చర్మంపై విడుదలయ్యే అదనపు నూనె ఉత్పత్తులను తగ్గిస్తాయి. అవిసె గింజలలో ఎక్స్ పోలియేట్, క్లెనింగ్స్ వంటి లక్షణాలు అధికంగా లభిస్తాయి. వీటిని అనేక రకాలుగా ముఖంపై అప్లై చేయవచ్చు. అంతే కాకుండా అవిసె గింజలు ఫేస్ ప్యాక్ ఉంపయోగించడం ద్వారా చర్మం ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతుంది. వాటిలో ఉండే ఫాటీ ఆసిడ్స్ సెబమ్ స్రావాన్ని నియంత్రిస్తాయి. చర్మంపై కలిగే రంధ్రాల సమస్య నుండి రక్షిస్తాయి.


అవిసె గింజలతో ఫేస్‌ ప్యాక్‌

అవిసె గింజలు, నిమ్మకాయ, తేనెతో ఫేస్ ప్యాక్

అవిసె గింజలు, నిమ్మకాయ, తేనే కలిపి ఫేస్ ఫ్యాక్‌గా తీసుకుంటే మొటిమల సమస్య నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఫ్లాక్ సీడ్స్ లో యాంటీ మైక్రోబియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం పై కలిగే ఇన్ఫెక్షన్లను నుంచి రక్షిస్తాయి. ఫేస్ ప్యాక్ కోసం గుప్పెడు అవిసె గింజలను తీసుకొని వాటిని నానబెట్టాలి. ఆతర్వాత వాటిని పేస్ట్ లాగా చేసి అందులో కొంచెం తేనె, టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి అఫ్లై చేయాలి. 10 నిముషాల పాటు అలానే ఉంచి తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటమల సమస్య తగ్గుముఖం పడుతుంది.

అవిసె గింజెలు, బియ్యంపిండి ఫేస్ ప్యాక్

టీ స్పూన్ అవిసె గింజలను వాటర్ లో తీసుకొని ఒకటి, రెండు నిముషాల పాటు గ్యాస్ మీద వేడి చేయాలి. అప్పుడు అవిసె గింజల జెల్ సిద్ధమవుతుంది. దానిని బ్లెండ్ చేసి వాటిలో కొంచెం బియ్యంపిండి వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 10 నిముషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల వృద్ధాప్య సమస్యలు తొలగిపోతాయి.

Also Read: ఇమ్యూనిటీని పెంచే బెస్ట్ జ్యూస్ ఇదే !

అవిసె గింజెలు,పెరుగు, దాల్చిన చెక్క పొడితో ఫేస్ ప్యాక్

చర్మంలో మెలనిన్ పరిమాణం పెరగడం వల్ల స్కిన్ పెగ్మెంటేషన్ సమస్యలు ఎక్కవయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యలనుండి బయటపడాలంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. అవిసె గింజలను పెరుగులో కొంచెంసేపు నానబెట్టి ఆతర్వాత దాల్చిన చెక్కపొడి వేసి.. కలపి ముఖానికి అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మంపై మచ్చలు తొలగిపోతాయి.

ముల్తానీ మట్టి, తేనె, అవిసె గింజల ఫేస్ ప్యాక్

అవిసె గింజెలను 10 నిముషాల పాటు నానబెట్టి.. మెత్తగా పేస్ట్ చేసి అందులో ముల్తానీ మట్టి, తేనె కలిపి, రోజ్ వాటర్ అవసరాన్ని బట్టి వాడండి. ఈ మూడింటిని మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మం నలుపుదనం తగ్గిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

అవిసె గింజలు, ఓట్స్‌తో చర్మ కాంతిని పెంచండి

ఈ ఫేస్ ప్యాక్ కోసం అవిసె గింజలను 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి.. ఆతర్వాత ఓట్స్ మీల్ పౌడర్ తో మిశ్రమాన్ని సిద్దం చేసుకోండి.  ఈ రెండింటిని మిక్స్ చేసి..  పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి కొంచెం సేపు మసాజ్ చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మఖం కాంతివంతంగా మెరుస్తుంది. చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

 

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×