E-Paper
Advertisement

Shobita Dhulipala:- త‌ప్పు చేయ‌లేదు.. రూమ‌ర్స్‌కు క్లారిటీ ఇవ్వాల్సిన ప‌నిలేదు…

Shobita Dhulipala:- త‌ప్పు చేయ‌లేదు.. రూమ‌ర్స్‌కు క్లారిటీ ఇవ్వాల్సిన ప‌నిలేదు…
Advertisement

Shobita Dhulipala:- నాగ చైత‌న్య‌, స‌మంత విడాకులు తీసుకుని రెండేళ్లు అవుతుంది. అయితే కూడా ఇప్ప‌టికీ వారిపై సోష‌ల్ మీడియాలో ఎవో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. వీలున్న‌ప్పుడ‌ల్లా స‌మంత‌, నాగ చైత‌న్య‌లు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అయితే వారిద్ద‌రితో పాటు వారి కార‌ణంగా వార్త‌ల్లో మ‌రో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. అదెవ‌రో కాదు.. శోభితా ధూలిపాళ‌. అందుకు కార‌ణం.. సమంత నుంచి విడిపోయిన నాగ చైతన్య ఆమెతో డేటింగ్ ఉన్నాడంటూ వార్త‌లు రావ‌ట‌మే.

చైత‌న్య‌, శోభిత ముంబైలో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ ఫొటోల‌తో స‌హా వార్త‌లు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. తాజాగా హీరోయిన్ శోభితా ధూలిపాళ వాటిపై త‌న‌దైన స్టైల్లో క్లారిటీ ఇచ్చేసింది. ‘‘నేనేం తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు మీడియా ముందుకు అనవసరంగా వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సిన ప‌ని లేదు. ప్ర‌స్తుతం కెరీర్‌లో మంచి ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. మ‌ణిర‌త్నంగారి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాను. అలాగే ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారి మ్యూజిక్‌లో పాట‌ల‌కు డాన్సులేశాను. న‌టిగా ఎంజాయ్ చేస్తున్నాను’’ అని శోభితా ధూలిపాళ నాగ చైతన్యతో తనపై వస్తోన్న డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చేసింది. మరి ఇకనైన సోషల్ మీడియాలో నాగ చైతన్య, శోభితల డేటింగ్ పై రూమర్స్ రావటం ఆగిపోతాయేమో చూడాలి.

Advertisement

వైజాగ్‌కి చెందిన శోభిత తెలుగు నేలతో ఉన్న రిలేషన్ గురించి కూడా గొప్పగా మాట్లాడింది. వైజాగ్‌లో తనకు సొంత ఇల్లు కూడా ఉందని ఆమె ఈ సందర్భంగా తెలియజేసింది. రీసెంట్‌గా శోభితా ధూలిపాళ న‌టించిన పొన్నియిన్ సెల్వ‌న్ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అందులో ఆమె జ‌యం ర‌వికి జంట‌గా న‌టించింది. మ‌రో వైపు ఆమె ఓటీటీలోనూ ది నైట్ మేనేజర్ వంటి వంటి వెబ్ సిరీస్‌లలో ప్రేక్ష‌కుల‌ను త‌న‌దైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూనే ఉంది. ది నైట్ మేనేజర్ సీజన్ 2 త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×