BigTV English

Rajinikanth:- మ‌ళ్లీ ముంబై భాయ్‌గా త‌లైవ‌ర్‌.. ‘లాల్ సలాం’లో మాస్ లుక్

Rajinikanth:- మ‌ళ్లీ ముంబై భాయ్‌గా త‌లైవ‌ర్‌.. ‘లాల్ సలాం’లో మాస్ లుక్


Rajinikanth:- ఏడు ప‌దుల వ‌య‌సులోనూ వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోన్న స్టార్ హీరో మ‌న సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌. ఇప్పుడీయ‌న ఏకంగా ఒక‌టి కాదు.. రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. అందులో ఒక‌టి లాల్ స‌లాం. ఆయ‌న కుమార్తె ఐశ్వ‌ర్య ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ మూవీలో ర‌జినీకాంత్ ఓ స్పెష‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ రోల్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. బాషా చిత్రం త‌ర్వాత ర‌జినీకాంత్ మ‌రోసారి ముంబై డాన్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌టం విశేషం.

ముంబైలో మొయిద్దీన్ భాయ్ పాత్ర‌లో త‌లైవ‌ర్ ర‌ఫ్పాడించ‌నున్నారు. ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. లుక్‌ను గ‌మ‌నిస్తే ముస్లిం గెట‌ప్‌లో ర‌జినీకాంత్ రాయ‌ల్‌గా న‌డిచివ‌స్తున్నారు. తలైవ‌ర్ మాస్ గెట‌ప్ ఓ రేంజ్‌లో ఉంది. బాషాలో మాణిక్ బాషాగా అల‌రించిన మ‌న సూప‌ర్ స్టార్ ఇప్పుడు లాల్ స‌లాంలో మొయిద్దీన్ భాయ్‌గా మెప్పించ‌బోతున్నారని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఈ చిత్రంలో ర‌జినీకాంత సోద‌రి పాత్ర‌లో జీవితా రాజ‌శేఖ్ క‌నిపించ‌బోతున్నారు. ర‌జినీకాంత్ సినిమా కోసం ఆమె 33 ఏళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం.


భారీ బ‌డ్జెట్ విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాల‌తో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రీసెంట్‌గా పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో ‘లాల్ సలాం’ క్రేజీగా రూపొంద‌నుంది. 8 ఏళ్ల త‌ర్వాత ఐశ్వ‌ర్య రజినీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు రామ‌స్వామి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

లాల్ సలాంలో కీలక పాత్రలో నటిస్తోన్న రిజనీకాంత.. మరో వైపు హీరోగా జైలర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత జై భీమ్ డైరెక్టర్‌తో తలైవా సినిమా రూపొందనుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×