BigTV English

Sree Vishnu: ‘ఐటమ్’ గా మారిన శ్రీవిష్ణు.. ఆడియన్స్ అస్సలు ఊహించి ఉండరు..!

Sree Vishnu: ‘ఐటమ్’ గా మారిన శ్రీవిష్ణు.. ఆడియన్స్ అస్సలు ఊహించి ఉండరు..!

Sree Vishnu: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు శ్రీవిష్ణు.. విభిన్న కథా చిత్రాలతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఈ మధ్య ఈయన నటిస్తున్న ప్రతి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న హీరోలలో ఒకరు శ్రీ విష్ణు. మొదట షార్ట్ ఫీలిమ్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ హీరో ఆ తర్వాత సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ వరుస హిట్ మూవీలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గత ఏడాది ఓం భీమ్ బుష్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ కామెడితో కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు కొత్తగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతని నెక్స్ట్ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి చూసేద్దాం..


నటుడు శ్రీవిష్ణు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. ఎన్నో విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ అవి కమర్షియల్ గా పెద్ద రేంజ్ సక్సెస్ ని చూడలేకపోయాయి. మధ్యలో రెండు మూడు సినిమాలు పర్వాలేదు అనిపించాయి. ‘సమజవరగమనా’ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ చిత్రం తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.. పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నార్త్ అమెరికా లో కూడా ఏకంగా 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను వసూల్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఒక్కో మూవీతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు..

ఒక్కో చిత్రంతో తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. స్వాగ్ మూవీతో ఈ హీరో డిఫరెంట్ గా చేసిన కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.. ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడని ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీ విష్ణు హీరో గా ‘సింగిల్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంతో పాటు ఆయన ‘మృత్యుంజయ్’ అనే మరో మూవీలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో పాటుగా మరో కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. ఆ మూవీనే ఐటమ్.. టైటిల్ కు తగ్గట్లు మూవీ స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. టైటిల్ కి సంబంధించి అధికారిక ప్రకటన బయటకు రావాల్సి ఉంది కానీ, ఇదే టైటిల్ ని ఖరారు చేసినట్టు మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు.. నాగవంశీ ఈమధ్య కాలంలో చేస్తున్న ప్రతీ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్స్ అవుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా శ్రీవిష్ణు నటిస్తున్న సినిమాలు గీతా ఆర్ట్స్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్స్ లో శ్రీ విష్ణు సినిమాలు పడుతున్నాయి.. ఈసారి ఈ మూవీ కూడా మంచి హిట్ ను అందుకుంటుందని భావిస్తున్నారు..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×