WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్… విజేతగా ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీం నిలిచింది. శనివారం రోజున రాత్రి బ్రబౌర్న్ స్టేడియంలో… జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీం.. ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై ఇండియన్స్… ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ట్రోఫీని అందుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీం చాలా.. కష్టపడి కప్ గెలిచిందని చెప్పవచ్చు.
Also Read: IPL Controversies: శ్రీశాంత్ చెంపదెబ్బ నుంచి కోహ్లీ-గంభీర్ వరకు.. ఐపీఎల్ పంచాయితీలు ఇవే !
పాయింట్స్ టేబుల్ లో… మొదటి నుంచి ఆదిపత్యం చెలాయిస్తున్న… ముంబై ఇండియన్స్ టీం… ఛాంపియన్గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్…. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ బోల్తా కొట్టింది. చివరి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నం చేసి… 8 పరుగులతో ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 141 పరుగులు మాత్రమే చేసింది. ఇంకా 8 పరుగులు చేయాల్సి ఉండగా… చేరుకోలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ తరుణంలోనే ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన ఢిల్లీ రన్నర్ ఆప్ గా నిలిచింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే… టాప్ ఆర్డర్ పెద్దగా రాణించకపోయినా మిడిల్ ఆర్డర్ దుమ్ము లేపింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్… 66 పరుగులు చేసి రఫ్పాడించారు.
44 బంతుల్లో 66 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్… రెండు సిక్సర్లు అలాగే తొమ్మిది బౌండరీలు బాదడం జరిగింది. అటు… బృంట్ 28 బంతుల్లో 30 పరుగులు చేసి దుమ్ము లేపింది. ఈ ఇద్దరు ప్లేయర్లు అద్భుతంగా రాణించడంతో 149 పరుగులు చేయగలిగింది టీమిండియా. అటు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్ లో జెమిమా 30 పరుగులు చేయగా, మారిజన్నే 40 పరుగులు చేసి దుమ్ము లేపింది. చివర్లో నిక్కీ ప్రసాద్… ఆడాలని ప్రయత్నం చేసినా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. ఇది ఇలా ఉండగా… ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అటు అమంజూట్ కౌర్ కు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కూడా దక్కింది. ఇక ఈ మ్యాచ్ లో ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ కు ప్రైజ్ మనీ 6 కోట్లు దక్కింది. అలాగే రన్ రప్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడు కోట్లు దక్కడం జరిగింది. ఇది ఇలా ఉండగా 2023 సంవత్సరంలో కూడా ముంబై ఛాంపియన్గా నిలిచింది.
Also Read: JioStar – IPL 2025: IPL 2025తో అంబానీ పంట పండటం ఖాయం..10 సెకన్లకు రూ.20 లక్షలా?
Mumbai Indians captain Harmanpreet Kaur is adjudged as the POTM in the WPL 2025 Final for her wonderful knock of 66 (44) 🏆
📸: JioHotstar#WPL2025 #MumbaiIndians #HarmanpreetKaur #CricketTwitter pic.twitter.com/xl8uq94q8g
— InsideSport (@InsideSportIND) March 15, 2025