BigTV English

Side B: సప్త సాగరాలు దాటి సైడ్‌ బి.. ఒకేసారి అన్ని భాషల్లో గ్రాండ్ విడుదలకు సిద్ధం..

Side B: సప్త సాగరాలు దాటి సైడ్‌ బి.. ఒకేసారి అన్ని భాషల్లో గ్రాండ్ విడుదలకు సిద్ధం..

Side B: టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో కన్నడ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చాలు చిన్న సినిమాలైనా సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి. పైగా అవి నేటివిటీకి ,నాచురాలిటీకి ఎంతో దగ్గరగా ఉండడంతో ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఒక ఐదు సంవత్సరాల క్రితం కన్నడ సినిమా ఇండస్ట్రీ లో పాతిక కోట్లు వసూలు వస్తే అదేదో గొప్ప అన్నట్లు ఉండేది పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ సిచువేషన్ పూర్తిగా మారిపోయింది.


అయితే ఇప్పుడు గటిగా పది కోట్ల లోపు బడ్జెట్ తో దొరకెక్కిన కన్నడ చిత్రాలు కూడా వందల కోట్లు తమ ఖాతాలో వేసుకునే స్థితికి చేరుకున్నాయి. కాంతారా మూవీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే తాజాగా కన్నడలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయినా సప్త సాగరాలు మూవీ తెలుగులో కూడా విపరీతమైన స్పందన అందుకుంది.రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్‌ ఈ మూవీ లో జంటగా నటించారు. కన్నడ లో 100 కోట్లు సాధించడం తో ఈ మూవీ తెలుగు లో కూడా డబ్‌ చేసి విడుదల చేశారు.

ఇక సప్త సాగరాలు దాటి మూవీ పార్ట్ వన్ సెప్టెంబర్ 22న తెలుగులో విడుదల చేయడం జరిగింది. ఈ పార్టీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, ఎలాగైనా ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకోవడం, కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల మధ్యలోనే హీరో జైలుకి వెళ్లడం లాంటి ఎమోషనల్ సన్నివేశాలను చూపించారు. ఇక తల్లి కోసం హీరోని మర్చిపోలేకపోయినప్పటికీ హీరోయిన్ వేరొకరిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక సెకండ్ పార్ట్ లో హీరోయిన్ పెళ్లి అయిపోయాక జైలు నుంచి హీరో విడుదల అయితే ఈ ఇద్దరు జీవితం ఏ గమ్యానికి చేరుతుందో అన్న విషయంపై చిత్రీకరణ జరుగుతుందన్నమాట.


తెలుగు లో కూడ ఈ మూవీ మాంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చిన తర్వాత కూడా ఓ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు మంచిగా హిట్ అయిన మూవీస్ కి సీక్వెల్ చేయడం కామన్ గా మారింది. ఈ నేపద్యంలో ఈ మూవీ కి వచ్చిన రెస్పాన్స్ కారణంగా సెకండ్ పార్ట్ సైడ్‌ బి అదేనండి సీక్వెల్‌ రాబోతుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లోనే డైరెక్టర్ హేమంత్ ఎం రావు సెకండ్ పార్ట్ ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు.

మొదటి పార్ట్ ఇంపాక్ట్ పూర్తిగా తగ్గక ముందే సెకండ్ పార్ట్ దించేస్తే మంచిది అని అనుకున్నాడో ఏమో డైరెక్టర్ అప్పుడే సైడ్‌ బి అంటూ సెకండ్ పార్ట్‌ విడుదలకు అన్ని సిద్ధం చేస్తున్నాడు. నవంబర్‌ 17 న సప్తసాగరాలు దాటి సైడ్‌ బి ను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్టు అనౌన్స్ కూడా చేశారు. అయితే ఈసారి ముందుగా కన్నడలో రిలీజ్ చేసి తర్వాత తెలుగులోకి తీసుకురావడం కాకుండా కన్నడ తో పాటు ఒకేసారి ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి పార్ట్ 2 ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×