E-Paper
Advertisement

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!
Advertisement

Dino Deets: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్‌ల రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ తరం నుంచి నారా లోకేష్ కుమారుడు, చంద్రబాబు మనవడైన నారా దేవాంశ్ ఒక సరికొత్త రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. చిన్న వయసులోనే విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే ఉద్దేశంతో ఆయన కంటెంట్ క్రియేటర్‌గా మారి, యూట్యూబ్‌లో ‘డైనో డీట్స్’ (Dino Deets) పేరుతో ఒక సరికొత్త పాడ్‌కాస్ట్ ఛానల్‌ను ప్రారంభించారు.

Read also-Illu illaalu Pillalu : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య రియల్ లైఫ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంత..?

డైనోసార్ల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ…

Advertisement

నారా దేవాంశ్ ప్రారంభించిన ఈ ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్ పూర్తిగా డైనోసార్ల చుట్టూ తిరుగుతుంది. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన డైనోసార్ల జీవన విధానం, వాటి రకాలు, అంతరించిపోవడానికి గల కారణాలు వాటి శిలాజాల గురించిన ఆసక్తికరమైన విషయాలను దేవాంశ్ ఈ ఛానెల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా, పిల్లలను, పెద్దలను ఆకట్టుకునేలా సరదాగా, నవ్విస్తూ ఆలోచింపజేసే శైలిలో ఈ పాడ్‌కాస్ట్‌లు సాగనున్నాయి.

తండ్రి లోకేష్ స్పందన..

ఈ ఛానెల్‌కు సంబంధించిన ప్రత్యేక ప్రోమో వీడియోను మంత్రి నారా లోకేష్ తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. “ఒకరోజు ఉదయం దేవాంశ్ గదిలోకి వెళ్లేసరికి గది అంతా డైనోసార్ బొమ్మలు, పెయింటింగ్స్, పుస్తకాలతో నిండిపోయి ఉంది. మొదట నాకు అర్థం కాలేదు కానీ, ఆ తర్వాత దేవాంశ్ ఈ యూట్యూబ్ ఛానల్ ఐడియా గురించి చెప్పాడు” అని లోకేష్ పేర్కొన్నారు. దేవాంశ్ సృష్టించిన ఈ సరికొత్త ప్రపంచాన్ని ఒక ప్రేక్షకుడిలా చూడటానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

Read also-K Rajan: కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కె. రాజన్ ఆత్మహత్య!

ఎపిసోడ్ల వివరాలు..

ఈ ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్ మొదటి పూర్తి ఎపిసోడ్ రాబోయే శుక్రవారం అధికారికంగా విడుదల కానుంది. ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఒక కొత్త ఎపిసోడ్‌ను యూట్యూబ్‌తో పాటు ఇతర ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షకులకు అందుబాటులో ఉంచనున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×