BigTV English

Box Office: సంక్రాంతి బరిలో ఆ ఒక్క మూవీ ప్లేస్ డౌట్..

Box Office: సంక్రాంతి బరిలో ఆ ఒక్క మూవీ ప్లేస్ డౌట్..

Box Office: దసరా సినిమా సందడి మొదలైంది.. ఈ నేపథ్యంలో రాబోయే సంక్రాంతికి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోరు ఎంతో రసవత్తరంగా మారుతుంది. గట్టిగా మూడు సినిమాలు కూడా రాకపోతేనే థియేటర్లు వేటికి ఇవ్వాలో అర్థం కాక గజగజలాడే పరిస్థితి. మరి ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి మరి అప్పుడు థియేటర్ల పరిస్థితి ఏమిటో? దీంతో అసలు ఇన్ని సినిమాలకు ఉన్న కాస్త థియేటర్లను ఎలా సర్దుబాటు చేస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


సంక్రాంతి బరిలోకి దిగనున్న అన్ని చిత్రాలలోకి ఒకే ఒక చిత్రం ప్రధానంగా థియేటర్ల సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. రేపు సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం ,రవితేజ ఈగల్ ,వెంకటేష్ సైంధవ్ ,నాగార్జున నా సామిరంగా వరుసగా బరిలోకి దిగుతున్నాయి. ఇక వీటితోపాటు తేజ సజ్జా హనుమాన్ కూడా రంగానికి సిద్ధమవుతోంది. ఉన్నవి చాలవని విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అంటూ ఓ మంచి ఫ్యామిలీ మూవీ తో వస్తున్నాడు. ఈ పతాకాల పండక్కి సినిమాల మధ్య పోటీ పతాక స్థాయికి చేరనుంది.

అయితే ఉన్న సినిమాలన్నిటిలోకి ఎక్కువ డిమాండ్ ఉన్న మూవీ మహేష్ బాబు గుంటూరు కారం అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మహేష్ బాబు ఒక బ్రాండ్.. అటు ఇటు ఎవరున్నా సరే.. మహేష్ మూవీ అంటే ఆ కిక్కే వేరు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మంచి బజ్ లో ఉన్న చిత్రం సైంధవ్. వెంకటేష్ చాలా కాలం తర్వాత మంచి మాస్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వెంకటేశ్ లుక్స్ చిత్రంపై హైప్ ను బాగా పెంచాయి.


ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో లాస్ట్ కు వచ్చిన ఫ్యామిలీ మెన్ చేరుకుంది. ఈ మూడు చిత్రాలకి సురేష్ బాబు ,దిల్ రాజ్ నిర్మాతలుగా వ్యవహరించడం మరొక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. బడా నిర్మాతల బడా చిత్రాలకి థియేటర్ల పంపిణీ పెద్ద సమస్య కాదు. ఈగల్ మొదట సంక్రాంతికి వస్తుందని అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత ఈ మూవీ పై ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. మరోపక్క నాగార్జున మూవీ షూటింగ్ పూర్తి అయితేనే సంక్రాంతి బరిలోకి దిగుతుంది. కానీ నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి కన్ఫామ్ గా పండక్కి ఈ మూవీ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇక మిగిలింది హనుమాన్ చిత్రం మాత్రమే.

ఇంతమంది బడా హీరోల మధ్య పోటీపడుతూ థియేటర్లు దక్కించుకునే అవకాశాలు ఈ మూవీకి చాలా తక్కువ అనే చెప్పాలి. స్క్రీన్లు దక్కించుకోవడమే పెద్ద సవాలు అంటే ఇంత పోటీ తట్టుకొని కలెక్షన్స్ వసూలు చేయడం అంతకంటే పెద్ద సవాలు. మరి ఈ మూవీని ధైర్యం చేసి పండక్కే విడుదల చేస్తారా లేక అగ్ర హీరోల సినిమాలు అయిపోయాక కాస్త ఖాళీ టైం చూసి మంచిగా వసూళ్లు చేసుకోవడానికి ప్లాన్ చేస్తారా చూడాలి మరి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×