E-Paper
Advertisement

Vani Jairam: మూగబోయిన వాణీ… సినీ ప్రస్థానం సాగిందిలా..

Vani Jairam: మూగబోయిన వాణీ… సినీ ప్రస్థానం సాగిందిలా..
Advertisement

Vani Jairam: ప్రముఖ గాయని వాణీజయరాం కన్నుమూశారు. చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. వాణీజయరాం అసలు పేరు కలైవాణి. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న జన్మించిన వాణీజయరాం… తెలుగు, తమిళం సహా పలుభాషల్లో పాడారు. ఇటీవలే వాణీజయరాంకు కేంద్రం పద్శభూషణ్‌ ప్రకటించింది. ఆరుగులు అక్కాచెల్లెళ్లల్లో వాణీజయరాం ఐదో సంతానం. వాణీజయరాం మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

కర్ణాటక సంగీతం ఔపోసన పట్టిన ఆమె, ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలు చక్కగా పాడేవారు. ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించిన ప్రశంసలు అందుకున్నారు. మద్రాసు క్వీన్స్‌ మేరీ కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 20వేలకు పైగా పాటలు ఆలపించారు. ఇటీవలే వాణీ జయరాంకు కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్‌ ప్రకటించింది.

Advertisement

చిన్నప్పటి నుండే సంగీతం నేర్చుకున్నారు. అయితే ఆమె కుటుంబం కేవలం శాస్త్రీయ సంగీతం మాత్రమే పాడేది. సినిమా పాటలు వద్దనేవారు. పలువురు గురువుల వద్ద సంగీతం నేర్చుకున్న వాణీ జయరాంకు పదేళ్ల వయసులో ఆల్‌ ఇండియా రేడియోలో మొదటిసారి పాటలు పాడే అవకాశం వచ్చింది. అప్పట్నుంచి రేడియోలో, స్కూల్లో, సంగీత ప్రదర్శనలలో పాటలు పాడారు.

కానీ ఎప్పుడూ సినిమా పాటలు పాడలేదు. అయినా వాణీ జయరాంకి సినిమా పాటల మీద ఆసక్తి ఏర్పడి రేడియోలో వింటూ నేర్చుకునేవారు. ఎలాగైనా సినిమాల్లో పాటలు పాడాలని వాణీ జయరాం అనుకునేవారు. అయితే అంతలోనే ఆమెకి పెళ్లి జరిగింది. కానీ ఆమె భర్త జయరాం ప్రోత్సాహం ఇవ్వడంతో కర్ణాటిక్‌, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకొని కచేరీలు ఇస్తూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూశారు. ఓ సారి ముంబైలో తన మొదటి కచేరి ఇచ్చినప్పుడు సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్‌ ఆమె గొంతు బాగుందని చెప్పి 1970లో బాలీవుడ్ మూవీ ‘గుడ్డీ’లో పాట పాడే అవకాశం ఇప్పించారు. ఆ సినిమాలో తను పాడిన మొదటి పాట ‘బోలే రే’ అప్పట్లో సూపర్‌ హిట్టయి అవార్డులు కూడా రావడంతో మొదటి పాటతోనే వాణీ జయరాం దశ తిరిగింది.

Advertisement

ఇక అక్కడ్నుంచి తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ..లాంటి దాదాపు 14 భాషల్లో సినిమాల ఆఫర్స్ రావడంతో వరుసగా పాటలు పాడారు వాణీ జయరాం. తమిళంలో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్‌’ సినిమా పాటలు ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చాయి. తెలుగులో శంకరాభరణం సినిమాతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఈ పాటలతో జాతీయ అవార్డుని కూడా అందుకున్నారు. దీంతో తెలుగులో మరోచరిత్ర, వయసు పిలిచింది, మంగమ్మ గారి మనవడు, స్వాతికిరణం, శృతి లయలు, స్వర్ణకమలం, సీతాకోక చిలుక..లాంటిఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడి ప్రేక్షకులని మెప్పించారు.

14 భాషల్లో దాదాపు 8వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం నంది అవార్డులు, వివిధ స్టేట్ అవార్డులు, నేషనల్, ఫిలింఫేర్, సైమా, వివిధ దేశాల అవార్డుల్ని అందుకున్నారు. తాజాగా ఆమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేశారు.ఆమెను సినీ పాటలవైపు ప్రోత్సహించిన ఆమె భర్త జయరాం 2018లో కన్నుమూశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×