BigTV English

Singham Again Trailer: పోలీస్ రామాయణం.. రావణుడు మాత్రం హైలైట్ అంతే..

Singham Again Trailer: పోలీస్ రామాయణం.. రావణుడు మాత్రం హైలైట్ అంతే..

Singham Again Trailer: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కెరీర్ టాప్ సినిమాల లిస్ట్ తీస్తే సింగం టాప్ 10 లో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అజయ్ కు ఒక బ్రాండ్ ను తీసుకొచ్చిన సినిమా అదే అని చెప్పాలి. ఈ సినిమా తరువాత ఏ హీరో పోలీస్ గా కనిపించినా.. సింగం అని పిలవడం మొదలుపెట్టారు అని చెప్పొచ్చు. బాలీవుడ్ లో యాక్షన్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రోహిత్ శెట్టి. ముఖ్యంగా కాప్ సినిమాలు తీయడంలో రోహిత్ దిట్ట.


ఇక ప్రస్తుతం ఆయన  దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న చిత్రం సింగం అగైన్(Singham Again). దేవగన్ ఫిల్మ్స్ బ్యానర్  పై అర్జున్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే & రోహిత్ శెట్టి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇక బాలీవుడ్ లో సూర్యవంశీ అనే కాపీ సినిమాలో స్టార్ హీరోలు జస్ట్ క్యామియో చేస్తేనే.. ఇండస్ట్రీ దద్దరిల్లిపోయింది. ఇప్పుడు రోహిత్ శెట్టి ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నాడు. తన కాప్ ప్రాంచైజ్ హీరోలందరిని.. సింగం అగైన్ లోకి దింపాడు.  అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ ఇలా బాలీవుడ్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో కనిపించబోతున్నారు.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి  రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా సింగం అగైన్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమా మొత్తాన్ని ఒక్క లైన్ లో చెప్పాలంటే..  ఇదొక పోలీస్ రామాయణం అని చెప్పాలి. అంటే.. రామాయణంలో ఉన్న ప్రతి పాత్రలో ఒక పోలీస్ కనిపిస్తాడు.  బాజీరావు సింగం (అజయ్ దేవగన్).. ఒకపక్క ఉద్యోగం, ఇంకోపక్క కుటుంబంతో హ్యాపీగా ఉంటాడు. బాజీరావు సింగం భార్య(కరీనా  కపూర్).. తన కొడుకుకు రామాయణం చెప్తూ ఉంటుంది. సీత కోసం రాముడు 3000 కిలోమీటర్లు దాటి వెళ్ళాడు అని చెప్తే.. కొడుకు నమ్మడు. అదంతా ట్రాష్ అని, ఒకవేళ నిన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే.. నాన్న వస్తాడా.. ? అని అడుగుతాడు. దానికి బాజీరావు సింగం గురించి గూగుల్  సెర్చ్ చెయ్ తెలుస్తుంది అనే డైలాగ్  తో ట్రైలర్ మొదలయ్యింది. నిజంగానే కరీనా  కపూర్ ను  విలన్స్ కిడ్నాప్ చేస్తారు. 


రాముడిగా  ఉన్న బాజీరావు.. లంకకు వెళ్లి సీతగా ఉన్న కరీనా కపూర్ ను ఎలా కాపాడాడు.. ? రాముడికి లక్ష్మణుడుగా  టైగర్ ష్రాఫ్ కనిపించిన విధానం అదిరిపోయింది. ఇక తన బలం ఏంటో తెలియని హనుమంతుడిగా రణ్వీర్ సింగ్ ను.. రాముడిని సీతను కాపాడడానికి తనవంతు సాయం చేసిన గరుడ పక్షిలా  అక్షయ్ కుమార్ ను చూపించారు. ఇక లేడీ సింగంగా దీపికా ఎంట్రీ ఒక ఎత్తు అయితే.. వీరందరిని మించి రావణుడుగా అర్జున్ కపూర్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అనిమల్ లో రణబీర్ కపూర్ రక్తపాతాన్ని  మళ్లీ గుర్తుచేసినట్లు అనిపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ తో నింపేశారు. ఈ పోలీస్ రామాయణం దీపావళీ కానుకగా రానుంది. మరి ఈ సినిమాతో ఈ స్టార్ హీరోలందరూ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×