E-Paper
Advertisement

Sobita Dhulipala: అక్కినేని కోడలు.. ఐటెంసాంగ్.. ?

Sobita Dhulipala: అక్కినేని కోడలు.. ఐటెంసాంగ్.. ?
Advertisement

Sobita Dhulipalla: అయ్యబాబోయ్..   ఏంటి.. నిజమా.. ? సమంతనే  అనుకున్నాం .. ఈమె కూడా ఐటెం సాంగ్ చేస్తుందా.. ? అని నోళ్లు వెళ్ళబెట్టకండి. ఇంకా అది ఆ ఆఫర్  చర్చల్లోనే ఉందట.  శోభితా.. ఈ పేరు  ఒకప్పుడు వింటే.. తెలుగమ్మాయి.. తెనాలి అమ్మాయి అని చెప్పుకోనేవారు. అదే ఇప్పుడు శోభితా గురించి చెప్పాలంటే.. అక్కినేని పెద్ద కోడలు..  హీరో నాగ చైతన్య రెండో భార్య అని చెప్పుకుంటున్నారు. ఒకే ఒక్క నిర్ణయం.. ఆమెను ఫేమస్ ను చేసి పడేసింది.

ఇక సమంత- చై పెళ్లి తరువాత చై ఎంత మారాడో తెలియదు కానీ, సామ్ పూర్తిగా మారింది. హెయిర్ కట్ చేసుకొని చై వాళ్ల అమ్మలా  రెడీ అయ్యింది. గ్లామర్ సినిమాలు వదిలేసి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. అంతా బావుంది అనుకొనేలోపు ఇద్దరి మధ్య విభేదాలు..విడాకుల వరకు వెళ్లాయి. విడాకుల తరువాత సామ్  గట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అక్కినేని కోడలు.. ఐటెం సాంగ్ చేస్తుంది అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది.

Advertisement

ఎవరు ఎన్ని అన్నా.. ఇంట్లోవాళ్లే  వద్దు  అన్నా.. సామ్, పుష్ప లో ఐటెంసాంగ్ చేసింది. ఒకపక్క విమర్శిస్తూనే.. సామ్ డ్యాన్స్ కు ఫిదా  అయినవారు ఉన్నారు. ఇక ఇదంతా గతం. పెళ్లి తరువాత ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవడానికి సామ్ అలా చేసింది. కానీ, ఇప్పుడు శోభితా.. పెళ్ళికి ముందే ఒక ఐటెంసాంగ్ చేస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. గ్లామర్ రోల్స్ చేయడం శోభితాకు కొత్తేమి కాదు. అందుతున్న సమాచారం ప్రకారం.. బాలీవుడ్  స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3 లో శోభితాను ఐటెంసాంగ్ చేయమని అడిగినట్లు  తెలుస్తోంది. దానికోసం గట్టిగానే పారితోషికం ఇస్తామని కూడా చెప్పారట.

ఇక ఇప్పటికే రణ్వీర్ సింగ్, శోభితా ఒక కండోమ్ యాడ్ లో నటించిన విషయం కూడా విదితమే.   అయితే ఇప్పటివరకు శోభితా తన నిర్ణయాన్ని చెప్పలేదని తెలుస్తోంది. ఇప్పుడు కనుక ఈ చిన్నది ఓకే చెప్తే.. ఆమెపై వచ్చే ట్రోల్స్ ను ఎవరు ఆపలేరు. ఇప్పటికే శోభితా కన్నా సమంతనే బెటర్ అని కామెంట్స్ పెడుతున్న ఫ్యాన్స్.. ఆ ఐటెం సాంగ్ తరువాత చైతో పాటు  అక్కినేని కుటుంబాన్ని కూడా ఏకిపారేస్తారు. మరి దీనికి అక్కినేని కుటుంబం ఓకే చెప్తుందా.. ? లేదా.. ? లేక అక్కినేని కుటుంబం కోసం శోభితానే ఈ అవకాశాన్నీ వదులుకుంటుందా.. ? అనేది తెలియాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×