BigTV English

Viral Video: ఇలాంటి స్టంట్స్ అవసరమా బ్రో.. సిగరెట్‌ని ఎవరైనా ఇలా వెలిగిస్తారా అసలు..

Viral Video: ఇలాంటి స్టంట్స్ అవసరమా బ్రో.. సిగరెట్‌ని ఎవరైనా ఇలా వెలిగిస్తారా అసలు..

Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని వీడియోలు సాధారణంగానే ఉన్నా కూడా మరికొన్ని వీడియోలు మాత్రం అందరినీ ఆకర్షిస్తుంటాయి. అందరి అటెన్షన్ కోసం చాలా మంది వినూత్న వీడియోలు చేస్తుంటారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ప్రమాదకర వీడియోలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందులో కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటే మరికొంత మంది తృటిలో తప్పించుకుంటున్నారు.


కార్లు, బైకులపై సాహసాలు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు కూడా సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనో లేక అందరిని అటెన్షన్ కోసమో తెలీదు కానీ ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. సాధారణంగా సిగరెట్ ను అగ్గిపెట్టెతో వెలిగిస్తుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం వినూత్నంగా సిగరెట్ వెలిగించి కాల్చాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఓ ఖరీదైన కారుతో చిన్న సిగరెట్ వెలిగించాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి సాహసం చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో పోర్స్చె అనే లగ్జరీ కారును సిగరెట్ వెలిగించడానికి ఉపయోగించాడు. ఈ క్రమంలో కారులో డ్రైవింగ్ సీట్లో ఓ వ్యక్తి కూర్చుని కారు స్టార్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో యవకుడు సిగరెట్ పట్టుకుని వెలిగించడానికి ప్రయత్నాలు చేయగా, మరొకరు వీడియో తీశారు. ఇలా సిగరెట్ వెలిగించాలని వ్యక్తి కారు స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా పెద్ద మంట వచ్చింది. దీంతో యువకుడి చేయి కాలింది. వెంటనే సిగరెట్ వెలించాలనే ఆలోచన కూడా మానుకుని అక్కడి నుండి పక్కకు వెళ్లిపోయాడు. అయితే సిగరెట్ మాత్రం వెలిగింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు.


 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by ASAD KHAN (@asad_khan165)

Related News

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Big Stories

×