E-Paper
Advertisement

Singer Sunitha : హీరోగా మారిన సింగర్ సునీత కుమారుడు..

Singer Sunitha : హీరోగా మారిన సింగర్ సునీత కుమారుడు..
Advertisement
Singer Sunitha

Singer Sunitha : వారసులుగా సినీ పరిశ్రమల్లో అడుగుపెట్టి నటీనటులుగా తమ సత్తాను చాటుకున్న వారు ఎందరో ఉన్నారు. హీరో, హీరోయిన్ల వారసులు మాత్రమే కాదు.. దర్శకులు, నిర్మాతల వారసులు సైతం స్క్రీన్‌పై హీరోహీరోయిన్లుగా కనిపించాలనే కలలు కంటుంటారు. కానీ సింగర్స్‌కు వారసులుగా వచ్చేవారు ఎక్కువశాతం సింగర్స్‌గానే సెటిల్ అవుతారు. తాజాగా ఒక సింగర్ కుమారుడు మాత్రం హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు.

Advertisement

సునీత ఉపాద్రష్ట.. తన మధురమైన గానానికి, స్వరానికి తెలుగులోనే కాదు.. ఇతర సౌత్ భాషల్లో కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది సునీత. సింగర్‌గా మంచి గుర్తింపు అందుకోవడంతో తన వారసులను కూడా సింగర్స్‌గా చేయాలని తను ఆశపడింది. అనుకున్నట్టుగానే తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత దర్శకత్వంలో ఒక పాట పాడించి తన కూతురికి గుర్తుండిపోయే డెబ్యూను అందించగలిగింది సునీత.

కూతురులాగా కొడుకు మాత్రం సంగీతాన్ని కెరీర్‌గా ఎంచుకోలేదు. హీరో అవ్వాలని అనుకున్నాడు. ‘సర్కారు నౌకరీ’ అనే సినిమాతో సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా డెబ్యూ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇటీవల విడుదలయ్యింది. ఈ సినిమాకు శేఖర్ గంగమోనీ దర్శకత్వం వహిస్తున్నాడు. సీనియర్ ప్రఖ్యాత దర్శకుడు రాఘవేంద్ర రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భావనా వరపండల్ అనే థియేటర్ ఆర్టిస్ట్.. ఈ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం కానుంది. సర్కారు నౌకరీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సందర్భంగా సునీత ఆనందంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Advertisement

‘తల్లి, కొడుకు ఇద్దరికీ కల నిజమయ్యింది. కంగ్రాచులేషన్స్ ఆకాశ్. ఈ సినిమా పోస్టర్‌లో నువ్వు ఈ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్న కథ మాత్రమే కాదు.. నీ కలను నిజం చేసుకోవడానికి నువు పడిన ఎన్నో ఏళ్ల కష్టం, త్యాగం, డెడికేషన్ అన్నీ కనిపిస్తున్నాయి. నీ కలలకు రెక్కలొచ్చాయి. ఇక ఈ ప్రపంచమంతా నీ అద్భుతమైన ప్రయాణాన్ని వీక్షిస్తుంది.’ అని సునీత ఎంతో ఆనందంగా ఈ ఫస్ట్ లుక్‌ను తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×