BigTV English

Kuravi Veerabhadra Swamy : కురవి వీరభద్రస్వామిని దర్శిస్తే

Kuravi Veerabhadra Swamy : కురవి వీరభద్రస్వామిని దర్శిస్తే
Kuravi Veerabhadra Swamy


Kuravi Veerabhadra Swamy : తెలంగాణలో అత్యంత పురాతనమైన ఆలయాల్లో కురవి వీరభద్రస్వామి ఆలయం ఒకటి.. క్రీ. శ 900 లో వెంగీ చాళుక్య రాజవంశానికి భీమరాజు వీరభద్ర స్వామి ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.. భక్తులు ఇక్కడ నిత్యపూజ చేస్తూ ఉంటారు. కురవి అంటే ఎరుపు. 3 కళ్ళు పది చేతులతో భయంకరంగా కనిపించే వీరభద్ర స్వామి రూపం భూత ప్రేతలాకు వణుకు పుట్టిస్తుంది. స్వామి పాదాల దిగువన నంది వాహనం ఉంటుంది. ఎడమ వైపు భద్రకాళి దర్శనమిస్తుంది.

ఇంటికి పట్టిన దుష్టశక్తుల పీడ నుంచి విముక్తి కోసం భక్తులు ఇక్కడ వీరభద్రుడ్ని కొలుస్తుంటారు. ఈ ఆలయంలోని ధ్వజ స్తంభం ఎన్నో మహిమలకు సాక్షిగా నిలుస్తుంది.ఈ స్తంభాన్ని ఆలింగనం చేసిన
వ్యక్తి నోటి వెంట నిజాలు తన్నుకుంటూ వస్తాయి. అబద్దం చెప్పాలనుకున్నా చెప్పలేడు. ధ్వజ స్తంభం కింద ఉన్న శక్తి యంత్రమే ఇందుకు కారణమని భక్తులు నమ్ముతుంటారు అందుకే శక్తి యంత్రంతో కొన్ని సమస్యలు రావడంతో ధ్వజ స్తంభాన్ని కొంచెం పక్కకి జరిపారట. శివరాత్రి వేడుకల సమయంలో ఈ క్షేత్రంలో భద్రకాళి-వీరభద్రుల కళ్యాణం కమనీయంగా నిర్వహిస్తుంటారు. 16 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సమయంలో జరిగే రథోత్సవం , పలహార బండ్ల ప్రదర్శన ఆకట్టుకుంటుంది.


ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉపాలయాలు ఉన్నాయి. అక్కడ చెట్టు కింద రాతి నందులు, నల్లరాతితో చెక్కిన భద్రకాళి విగ్రహం దర్శనమిస్తుంటాయి . పాతకాలం నాటి శివాలయం కూడా ఉంది. భక్తులే నేరుగా ఇక్కడ శివయ్యకి పూజలు చేయవచ్చు. అభిషేకాలు నిర్వహించవచ్చు. ఆలయానికి వచ్చే భక్తులు తడి బట్టలతో స్వామిని దర్శించి కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల నమ్మకం.
స్వామిని దర్శించుకుంటే సమస్త గ్రహ పీడలు తొలగిపోతాయని విశ్వాసం. శివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. స్వామి వారి తీర్దాన్ని పంట పొలాలపై జల్లితే పంటలు బాగా పండుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×