E-Paper
Advertisement

Yatra 2 Movie : సోనియా పాత్ర.. యాత్ర- 2లో సరికొత్త ట్విస్ట్..

Yatra 2 Movie : సోనియా పాత్ర.. యాత్ర- 2లో సరికొత్త ట్విస్ట్..
Advertisement
Yatra 2 Movie

Yatra 2 Movie : ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎన్నికల హడావిడితో వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో మరింత సెగ రేపే విధంగా రాజకీయ నేపథ్య చిత్రాల సందడి మొదలైంది. ఇలా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై వస్తున్న మూవీ ‘యాత్ర-2’. మహి.వి.రాఘవ డైరెక్షన్లో వచ్చిన యాత్ర చిత్రానికి ఇది సీక్వెల్ గా వస్తోంది. యాత్ర మొదటి భాగం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో ఆయన పదవికి రావడం కోసం చేసిన రాజకీయ ఎత్తుగడలు దగ్గర నుంచి పాదయాత్ర వరకు అద్భుతంగా చూపించారు.

ఇక ఇప్పుడు రాబోతున్న యాత్ర -2 చిత్రం తండ్రి మరణం తర్వాత జగన్ ఎలా ఎదిగారు అన్న విషయాన్ని ఆవిష్కరిస్తుంది. యాత్ర మూవీలో వైయస్సార్ పాత్రను పోషించిన ప్రముఖ మలయాళీ నటుడు మమ్ముట్టి యాత్ర -2లో కూడా చేస్తున్నారు. ఇప్పుడు యాత్ర -2 చిత్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను రంగం మూవీ ఫేమ్ తమిళ్ హీరో జీవా చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను హిందీ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ పోషిస్తున్నారు.

Advertisement

రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించిన పేరు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ. ఈ నేపథ్యంలో ఆమె పాత్రను యాత్ర -2 చిత్రంలో పెట్టారు. ఆమె పాత్రకు సెట్ అయ్యే విధంగా జర్మన్ యాక్టర్ సుజానే బెర్నెర్ట్‌ని ఎంపిక చేశారు. సోనియా పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. మంగళవారం ఆ పాత్ర ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫస్ట్ లుక్ తోపాటు విడుదల చేసిన టాగ్ లైన్ బాగా వైరల్ అవుతోంది.

“మీరు అతన్ని ఓడించ లేకపోతే.. అతన్ని నాశనం చేయండి..”అని టాగ్ లైన్ సోనియా ఫోటోకి జోడించారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైయస్ జగన్ కాంగ్రెస్ నుంచి దూరమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే సోనియా పాత్ర చిత్రీకరణ వెనుక ముఖ్య ఉద్దేశం కూడా ఆ సంఘటన గురించి ప్రస్తావించడమే అయి ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ పాత్ర పోషించిన సుజానే బెర్నెర్ట్‌ ఎవరా అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.

Advertisement

ఇంతకీ సుజానే బెర్నెర్ట్‌ ఎవరో కాదు దివంగత బాలీవుడ్ నటుడు అఖిల్‌ మిశ్రా భార్య. సుమారు 20 సంవత్సరాల నుంచి ఈమె ఇండియన్ సినిమాలో భాగమైపోయింది. సినిమాలతోపాటుగా వెబ్ సిరీస్, సీరియల్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. యాత్ర చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు యాత్ర చిత్రాన్ని కూడా ఇదే తేదీన విడుదల చేశారు. ఇప్పుడు తిరిగి ఎన్నికల నేపథ్యంలో అదే ముహూర్తాన్ని ఈ చిత్రానికి కూడా విడుదల చేయబోతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×