E-Paper
Advertisement

Mathu Vadalara 2 Review: ఫుల్ రివ్యూ.. ‘మత్తు వదలరా 2’ మత్తు వదలించిందా? జోకొట్టించిందా?

Mathu Vadalara 2 Review: ఫుల్ రివ్యూ.. ‘మత్తు వదలరా 2’ మత్తు వదలించిందా? జోకొట్టించిందా?
Advertisement

Mathu Vadalara 2 Review Telugu: ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి రెండవ కుమారుడు శ్రీ సింహా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. ‘మత్తు వదలరా’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహా తన మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. కానీ అవేమి పెద్దగా అలరించలేకపోయాయి. ఇక ఇప్పుడు ‘మత్తు వదలరా’ సినిమాకి సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’ తెరకెక్కించింది. ఇందులో శ్రీసింహా, ఫరియా అబ్దుల్లా, కమెడియన్ సత్య ముఖ్య పాత్రలో నటించారు. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ అంటే సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

బిగ్ టీవీ రేటింగ్ : 3/5

Advertisement

కథ

ఇందులో బాబు మోహన్ (శ్రీ సింహ)కు మత్తు నిద్ర, మతిమరుపు ఉంటుంది. అతడి ఫ్రెండ్ ఏసు (సత్య) కూడా అతడితో ఉంటాడు. డెలివరీ బాయ్స్‌గా ఉండే వీరిద్దరూ దొంగదారిలో ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్ కేసులను డీల్ చేసే ‘హీ టీమ్’లో చేరుతారు. ఎంత ఉద్యోగం చేసినా తమకు వచ్చే జీతం సరిపోదు. దీంతో కిడ్నాపర్లకు ఇచ్చే డబ్బులో సగం డబ్బును వీరు ‘తస్కరిస్తారు’. అయినా సరిపోదు. ఈసారి గట్టి ప్లాన్ వేస్తారు. ఎలాగైనా ఒక్క జాక్‌పాట్ కొట్టి జీవితాతం బతికేయాలని చూస్తారు. ఈ క్రమంలో దామిని (యాంకర్ ఝాన్సీ) తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారని.. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, ఏసుకు చెప్తుంది. దీంతో రంగంలోకి దిగిన వీరిద్దరు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అయితే ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ కేసు నుంచి బాబు, ఏసు ఎలా బయటపడ్డారు? హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

విశ్లేషణ

Also Read: ప్రేక్షకుల మత్తు వదిలేలా?.. ట్విట్టర్ రివ్యూ

ఈ ‘మత్తు వదలరా 2’ మూవీలో దర్శకుడు రితేష్ రానా ఎక్కువగా కామెడీపై ఆదారపడ్డాడు. ఓ వైపు ట్విస్ట్‌లు ఇస్తూ.. మరోవైపు కామెడీతో కడుపుబ్బా నవ్వించేశాడు. ముఖ్యంగా బాబు అండ్ ఏసు మర్డర్ కేసులో ఇరుక్కోవడం నుంచి బయటకు వచ్చేంత వరకు అద్భుతమైన పాయింట్‌తో కథను ఎంగేజింగ్‌తో దర్శకుడు అల్లాడు. కథకి అవసరమైన నటీ నటుల్ని పెట్టి.. సింపుల్ లోకేషన్స్‌లో సినిమా తీసి సూపర్ అనిపించుకున్నాడు. ఇక ఫస్ట్ పార్ట్‌కి కథ, కామెడీ బలం అయింది. ఇప్పుడు రెండో పార్ట్‌కి కామెడీనే బలం అయింది.

దర్శకుడు కామెడీ అనే అస్త్రంతో సినీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేశాడు. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలో కామెడీ ఇరికించడం చాలా కష్టం. కానీ దర్శకుడు మాత్రం తన తెలివితేటలతో సినిమాలో కామెడీ పెట్టి పొట్టచెక్కలు చేశాడు. ముఖ్యంగా ఈ సినమాకి నటుడు సత్య వెన్నుముకగా చెప్పుకోవాలి. అతడి యాక్టింగ్ సినిమాకే హైలైట్. ప్రతి సన్నివేశంలో అతడు వేసే పంచ్ డైలాగ్‌లు సినిమా ప్రియుల్లో నవ్వులు పూయించాయి. అలాగే శ్రీసింహా కూడా తన నటనతో అదరగొట్టేశాడు.

ఎవరు ఎలా చేశారు

శ్రీ సింహా ఇందులో బాబూ మోహన్ పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీసింహా, సత్య తమ నటనతో కడుపుబ్బా నవ్వించేశారు. వీరిద్దరి కాంబో సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా సినిమాకి సత్య కీలకం అనడంలో ఎలాంటి అతిసయోక్తి లేదు. అతడి నటన, నడక నుంచి మొదలు పెడితే ఎక్స్‌ప్రెసన్స్ వరకు అన్నీ కడుపుబ్బా సీన్లే కనిపిస్తాయి. ఈ సినిమాకి హీరో శ్రీసింహా అయినా సత్యకే ఎక్కువ మార్కులు పడ్డాయి. అంతలా నవ్వించాడు సత్య. హీరోకి ఏమాత్రం తీసిపోకుండా సత్య క్యారెక్టర్‌ను దర్శకుడు మంచిగా చూపించాడు.

అలాగే చిరంజీవి తరహాలో సత్య వేసిన స్టెప్పులు థియేటర్లలో ఈలలు వేయించడం పక్కా అని చెప్పాలి. దానికి తోడు వెన్నెల కిశోర్, సునీల్ తమ కామెడీతో మరింత ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఫరియా అబ్దుల్లా ఇందులో ఇంతక ముందు సినిమాల్లోలాగ గ్లామర్ పాత్రలో కాకుండా ఫుల్ స్కోప్ ఉన్న పాత్రలో హీ టీం మెంబర్‌గా అదరగొట్టేసింది. కథలో ఇన్వాల్ అయి దుమ్ము దులిపేసింది. ఎలాంటి పాటలు లేవు, ఎలాంటి గ్లామర్ పాత్రలు లేవు కేవలం క్యారెక్టర్‌కి స్కోప్ మాత్రమే. ఇలా ఎవరికిచ్చిన పాత్రలో వాళ్లు నటించడం కాకుండా జీవించేశారు. మొత్తంగా ఒక మంచి కామెడీ సినిమాను చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×