BigTV English

Mathu vadalara 2 : ప్రేక్షకుల మత్తు వదిలేలా?.. ట్విట్టర్ రివ్యూ

Mathu vadalara 2 : ప్రేక్షకుల మత్తు వదిలేలా?.. ట్విట్టర్ రివ్యూ

Mattu vadalara 2 movie twitter openions of public: కొన్ని సినిమాలు విడుదలకు ముందే హైప్ తెచ్చిపెడుతుంటాయి. 2019లో వచ్చిన మత్తు వదలరా 1 మూవీ అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సైలెంట్ గా హిట్ కొట్టింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా వచ్చింది మత్తు వదలరా 2. ఇక ప్రమోషన్స్ కూడా టీమ్ గట్టిగానే చేసుకుంది. ప్రస్తుతం హై బడ్జెట్ సినిమాల కంటే.. లో బడ్జెట్ సినిమాలే మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్, పూరీ రామ్ పోతినేనిల ఇస్మార్ట్ శంకర్, రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ఉన్నంతలో నాని మూవీకి నో లాస్ నో గెయిన్ అన్నట్లుగా.. పంపిణీదారులు దాదాపు గట్టెక్కినట్లే. ఆ మూవీకి టాక్ బాగానే వచ్చినా రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు, వరదలు నాని మూవీకి ఆటంకంగా మారాయి. వీటికంటే ముందు వచ్చిన కమిటీ కుర్రోళ్లు, ఆయ్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. మౌత్ టాక్ తోనే థియేటర్లకు రప్పించాయి. రెండు సినిమాలూ గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్ లో తీయడం విశేషం.


ఈరోజు మత్తు వదలరా 2 సినిమా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటించాడు. జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, సునీల్, సత్య కీలక పాత్రలు పోషించారు.

నెటిజన్స్ స్పందన


ఈ మూవీకి రితేష్ రానా దర్శకుడు. మత్తు వదలరా 1 తో హిట్ రేంజ్ అందుకున్న ఈ దర్శకుడు.. ఆ తర్వాత లావణ్య త్రిపాఠితో హ్యాపీ బర్త్ డే అనే మూవీకి దర్శకత్వం వహించారు. అయితే ఆ మూవీని ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. హీరో శ్రీసింహా కోడూరి కి కూడా తొలి చిత్రం తర్వాత పెద్దగా బజ్ వచ్చిన సినిమా ఏమీ రాలేదు. ఇక ఫరియా అబ్దుల్లా కూడా జాతి రత్నాలు తర్వాత నటించిన ఏ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. ప్రస్తుతం వీరందరికీ మత్తు వదలరా 2 మూవీ హిట్ కావడం కీలకమనే చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితేనే వారి కెరీర్ లో మంచి అవకాశాలు వస్తాయి. అలాగే కీరవాణి తనయుడు కాలభైరవకి కూడా ఈ సినిమా హిట్ కీలకం కానుంది. మరి భారీ అంచనాల నడుమ రిలీజైన మత్తు వదలరా 2 మూవీ ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ మూవీపై కొందరు నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకుందాం.

మత్తు వదలరా 2 ట్విట్టర్ రివ్యూ..

మత్తు వదలరా 2 మూవీ మొత్తం అన్నీ తానై అద్భుతమైన కామెడీని పండించాడని కమెడియన్ సత్యకు మంచి మార్కులే పడ్డాయని ఓ నెటిజన్ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని తెలిపారు. యేసుదాస్ అనే క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి అందరినీ తెగ నవ్వించాడు. అలాగే నితీష్ రానా డైరెక్షన్ కూడా అదిరిపోయిందని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

 

మరో నెటిజన్ సీక్వెల్ 2 అదరగొట్టిందని.. పతాక సన్నివేశాలు బాగున్నాయని రాసుకొచ్చారు. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి రిఫరెన్స్ బాగానే వర్కవుట్ అయింది. చిరంజీవి ఫ్యానిజంతో మూవీని కుమ్మేశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

ఇది కమెడియన్ సత్య వన్ మేన్ షో అని చెప్పాలి. కామెడీతో పాటు మాస్ అంశాలు కూడా ఉన్నాయి. సత్య కామెడీ టైమింగ్ అద్భుతం అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

 

ఇంకొక నెటిజన్ రాస్తూ ఫస్టాఫ్ చాలా బాగుంది. నవ్వి నవ్వి పొట్ట చెక్కలయింది. తెలుగు సినిమాకు సత్య ఓ ఆణిముత్యం అని చెప్పాలి. ఇదే రేంజ్ లోటాక్ స్పైడ్ అయితే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

సత్య రచ్చరంబోలా అనేలా ఇరగదీసాడు. తన అమాయకత్వం, వెర్రితనపు చేష్టలతో ప్రేక్షకులను కడుపుబ్బేలా నవ్వించాడు. ఈ జనరేషన్ కమెడియన్ యాక్టర్ అంటే ఆయనే. మొత్తానికి మత్తు వదలరా 2ని నిలబెట్టేశాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×