EPAPER

Rajamouli: సింహానికి మహేష్ పేరు పెట్టావ్ చూడు.. అరాచకం అంతే

Rajamouli: సింహానికి మహేష్ పేరు పెట్టావ్ చూడు.. అరాచకం అంతే

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి.. ఏది చేసినా సెన్సేషనే. ఆయన సినిమా చేసినా.. ప్రమోషన్స్ చేసినా.. చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసినా కూడా సెన్సేషనే.  ఆయన క్రియేటివిటీ అలా ఉంటుంది మరి.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో  మహేష్ బాబు హీరోగా SSMB29 సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై  కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ప్రపంచం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది.


యాక్షన్ అడ్వంచర్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విజయేంద్ర వర్మ..  SSMB29 కోసం మంచి పవర్ ఫుల్ కథను అందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే  ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. SSMB29 కోసం ఒక పక్క మహేష్ బాబు తన లుక్ మొత్తం మార్చే పనిలో ఉండగా.. జక్కన్న లొకేషన్స్ వెతికే పనిలో పడ్డాడు. దానికోసం  రాజమౌళి కెన్యా వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడకు వెళ్లిన దగ్గరనుంచి ఏదో ఒక ఫోటోను అభిమానులతో షేర్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.

Samantha: అతడి బిగి కౌగిలిలో సమంత.. ఇక తెలుగు వారికి దూరమే.. ?


నిన్నటికి నిన్న ఒక ఏడాది ప్రాంతంలో జంతువుల మధ్య నడుస్తూ కనిపించిన జక్కన్న తాజాగా మరో ఫోటోను షేర్ చేసి.. సోషల్ మీడియాను షేక్ చేసాడు. అడివికి రారాజు అయిన సింహం ఫోటోను తీక్షణంగా చూస్తూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ .. “ఇది క్రిస్ ఫాలోస్ చేత బంధించబడిన సెరెంగేటి రాజు ఫోటో ఇది. దీని పేరు BOB జూనియర్” అంటూ రాసుకొచ్చాడు.

ఇక్కడ వరకు ఓకే కానీ .. ఆ సింహం మీద క్లిక్ చేయగానే  మహేష్ బాబు పేరు రావడం హైలైట్ అని చెప్పాలి. అంటే  ఇన్ డైరెక్ట్ గా అడివికి రారాజు సింహం  మహేష్ బాబునే అని జక్కన్న  చెప్పేశాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి.  ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గామారింది. ఈ ఫోటోపై  అభిమానులు నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ పెడుతున్నారు.  సింహానికి మహేష్ పేరు పెట్టావ్ చూడు.. అరాచకం అంతే  అని కొందరు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలుసిసలైన సినిమా ముందుంది అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా తో రాజమౌళి- మహేష్ బాబు ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి. 

Related News

Pooja Hegde: రియలైజ్ అయిన బుట్ట బొమ్మ.. ఇకనైనా సరిదిద్దుకుంటుందా..?

Pranitha Subhash: డిజైనర్ స్టూడియో ప్రారంభించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఎక్కడంటే..?

Gayatri Bhargavi: దుల్కర్ సల్మాన్ పై యాంకర్ షాకింగ్ కామెంట్స్..ఎలా పరిచయమబ్బా..?

Kiran Abbavaram KA: మ్యాజిక్ వర్కౌట్ అయిందే.. పుంజుకున్న ‘క’ మూవీ..!

Nora Fatehi: తప్పుడు మనుషులను నమ్మాను, మానసికంగా కృంగిపోయాను.. ‘మట్కా’ నటి కామెంట్స్

Narne Nithin: ఘనంగా ఎన్టీఆర్ బామ్మర్ది నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్..!

Samantha: ఒంటరితనం భరించలేకున్నా.. సామ్ మాటలకు అర్థం ఏమిటి..?

Big Stories

×