Samantha: స్టార్ హీరోయిన్ సమంత తెలుగువారికి దూరమవుతుందా.. ? అంటే నిజమే అనే మాటలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆమె ముంబైకి మకాం మారుస్తుంది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, హైదరాబాద్ తనకు ఇల్లు లాంటింది అని, తెలుగుప్రేక్షకులు తనకు ఫ్యామిలీ అని చెప్పుకొచ్చి.. ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులను అసలు పట్టించుకోవడం పూర్తిగా మానేసిన్నట్లు కనిపిస్తుంది.
అసలు విషయంలోకి వెళితే.. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ఒక ఏడాది గ్యాప్ తీసుకొని ఈ మధ్యనే మళ్లీ కెరీర్ ను మొదలుపెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సామ్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఇక సినిమాలు కాకుండా అమ్మడి చేతిలో సిటాడెల్ వెబ్ సిరీస్ ఉంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈ సిరీస్.. నవంబర్ 7 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా .. ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది.
Sandeep Raj: ఆ హీరోయిన్ తో కలర్ ఫోటో డైరెక్టర్ పెళ్లి.. ఎప్పుడంటే.. ?
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఒకపక్క టీజర్, ట్రైలర్ ,సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు.. ఇంకోపక్క సామ్ , వరుణ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో సామ్.. వరుణ్ ధావన్ ను ట్యాగ్ చేసిన ఫోటోను షేర్ చేసింది. వరుణ్ ధావన్ బిగి కౌగిలిలో సామ్ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే ఇవన్నీ కేవలం హిందీ వరకే పరిమితమయ్యాయి.
ఇప్పటివరకు సిటాడెల్ హనీ బన్నీ తెలుగులో రిలీజ్..అవుతుందా ? లేదా అనే కన్ప్యూజన్ లోనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. టీజర్ కానీ, ట్రైలర్ కానీ తెలుగులో రిలీజ్ అవ్వలేదు. మిగతావారిని పక్కన పెడితే .. సామ్ టాలీవుడ్ హీరోయిన్. పాన్ఇండియా లెవెల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు. నేడు ఈ సిరీస్ నుంచి ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. కానీ, అది కూడా హిందీలోనే ఉంది.
NTR: అబ్బాయ్ టాలీవుడ్ ఎంట్రీ.. బాబాయ్ దీవెనలే హైలైట్
నిజం చెప్పాలంటే ప్రియాంకచోప్రా నటించిన సిటాడెల్ ట్రైలర్ కూడా తెలుగులో రిలీజ్ చేశారు. కానీ సామ్ నటించిన ఈ సిరీస్ ఇంకా తెలుగులో రిలీజ్ కాలేదు. అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది అంటే.. అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేయాలి కదా.. పోనీ సామ్ అయినా తెలుగు ప్రేక్షకులకు సిటాడెల్ గురించి చెప్పాలి కదా అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే.. సామ్ ఇకతెలుగు ప్రేక్షకులకు దూరం అయినట్టేనా.. ? ఇక ఆమె బాలీవుడ్ లోనే పాగా వేస్తుంది అన్న మాటలు నిజమయ్యాయా.. అనే కామెంట్స్ వినబడుతున్నాయి. మరి ఈ సిరీస్ తో సామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.