E-Paper
Advertisement

SSMB 28 : తమన్‌కి షాక్ తగిలేనా!

SSMB 28 :  తమన్‌కి షాక్ తగిలేనా!
Advertisement
SSMB 28

SSMB 28 : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సెన్సేష‌నల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌మ‌న్ రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీలోని టాప్ ప్రాజెక్ట్స్ అంతా త‌మ‌న్ చేతిలోనే ఉన్నాయి. అందులో ఒక‌టి SSMB 28. మ‌హేష్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా విష‌యంలో మేక‌ర్స్ అస్స‌లు త‌గ్గేదేలే అని అనుకుంటున్నారు. ఎందుకంటే అత‌డు, ఖ‌లేజా చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌యాల‌ను అందుకోలేదు. దీంతో ఈ మూడో సినిమాతో అయినా వీరిది హిట్ కాంబోగా నిల‌పాల‌ని టీమ్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

తాజాగా SSMB 28ని ఇబ్బంది పెడుతున్న విష‌యం మ్యూజిక్‌. సినిమా స్టార్ట్ కావ‌టానికే చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఇప్పుడిప్పుడే స్పీడుగా వెళుతుంది. అయితే ఇంకా త‌మ‌న్ మాత్రం ట్యూన్స్ ఇవ్వ‌లేద‌ట‌. అస‌లే త‌మ‌న్ మ్యూజిక్ గురించి మ‌హేష్‌కి అంత హ్యాపీగా లేడు. ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లోనే త‌మ‌న్‌ని ప‌క్క‌న పెట్టేయాల‌ని మ‌హేష్ అనుకున్న‌ప్ప‌టికీ గురూజీ మాట కోసం కంటిన్యూ చేశాడు. అయితే ఇప్పుడు గురూజీ కూడా త‌మ‌న్‌ని ప‌క్క‌న పెట్టేయ‌క త‌ప్పేలా క‌నిపించ‌టం లేదు. త‌మ‌న్ ఫుల్ బిజీగా ఉన్నాడు. చేతి నిండా సినిమాలున్నప్ప‌టికీ ఓ వైపు సీసీఎల్‌, మ‌రో వైపు ఆహా ఇండియ‌న్ ఐడిల్ 2 ప్రోగ్రామ్స్‌తో త‌మ‌న్ ఖాళీ లేకుండా ఉన్నారు.

Advertisement

ఇది మ‌హేష్‌కి బొత్తిగా న‌చ్చ‌టం లేద‌ట‌. దీంతో మ‌రో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని లైన్‌లో పెట్ట‌మ‌ని యూనిట్‌కి మ‌హేష్ చెప్పిన‌ట్లు నెట్టింట వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. నిజంగానే త‌మ‌న్‌ను SSMB 28 నుంచి ప‌క్క‌కు పెడితే మాత్రం అది త‌న‌కు పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంద‌న‌టంలో సందేహం లేదు. మ‌రి త‌మ‌న్‌ను ఎవ‌రితో రీప్లేస్ చేస్తార‌నేది కూడా ఆలోచించాల్సిన విష‌య‌మే. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ చేయటానికి మేకర్స్ నిర్ణయించుకుని అధికారిక ప్రకటనను కూడా రిలీజ్ చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×