BigTV English

IPL : ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో తమన్నా స్పెషల్ షో.. ఆసక్తిగా తొలి మ్యాచ్..

IPL : ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో తమన్నా స్పెషల్ షో.. ఆసక్తిగా తొలి మ్యాచ్..

IPL : మార్చి 31న నుంచి క్రికెట్ ఫ్యాన్స్ ను ఐపీఎల్ ఉర్రూతలూగించనుంది.అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో 16వ సీజన్‌ ప్రారంభం కానుంది. 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఐపీఎల్
రెండున్నర నెలలపాటు క్రికెట్ అభిమానులు మజాను అందించనుంది.


తమన్నా స్పెషల్ షో..
ఐపీఎల్ ప్రారంభ వేడుకను అదిరిపోయేలా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మార్చి 31న సాయంత్ర 6 గంటలకు ఐపీఎల్ ప్రారంభ వేడుకల సందడి మొదలవుతుంది. ఈ ఈవెంట్ లో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుంది. ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో తమన్నా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు.

ఫస్ట్ ఫైట్..
గతేడాది ఐపీఎల్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే హార్థిక్ పాండ్యా గుజరాత్‌ జట్టుకు టైటిల్ ను అందించాడు. తనలో నాయకత్వ లక్షణాలున్నాయని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ అందుబాటులో లేని సమయంలో టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్ గా అవకాశం దక్కించుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో తొలి వన్డేకు హార్థిక్ పాండ్యానే కెప్టెన్ వ్యహరించాడు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచింది. మరోవైపు మూడేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. మహి సారధ్యంలోని చెన్నై జట్టుపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అనే ప్రచారం జరుగుతోంది.


ముంబై టాప్..
ఐపీఎల్ లో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టు ముంబై. ఆ జట్టు 5 సార్లు టైటిల్ కైవసం చేసుకుంది. చెన్నై నాలుగుసార్లు విజేతగా నిలిచింది. బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్ జట్లు ఇంత వరకు ఒక్క టైటిల్ ను కూడా గెలవలేదు. మరి సారైనా ఐపీఎల్ కొత్త విజేతను చూస్తామా..?

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×