BigTV English

SSMB 28:- మహేశ్-త్రివిక్రమ్ సినిమా చెత్తబుట్టలోకే… తీసిందంతా స్క్రాప్ చేశారట..!

SSMB 28:- మహేశ్-త్రివిక్రమ్ సినిమా చెత్తబుట్టలోకే… తీసిందంతా స్క్రాప్ చేశారట..!

SSMB 28:- ఏ ముహూర్తాన మహేశ్-త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టారో గానీ… అస్సలు అచ్చిరాలేదు. సినిమా షూటింగ్‌కు అన్నీ అడ్డంకులే. మెయిన్‌గా మహేశ్ ఫ్యామిలీలో జరిగిన వరుస విషాదాల కారణంగా చాలా గ్యాప్ వచ్చింది. ఇక సినిమా పట్టాలెక్కిందనుకునే సమయానికి మహేశ్ బాబు లీవ్స్ తీసుకుని టూర్స్ వేసేవాడు. దీనికి తోడు కొన్నాళ్లు మ్యూజిక్ డైరెక్టర్ గురించి, మరికొన్నాళ్లు హీరోయిన్ సెలక్షన్ గురించి ఆగారు.


లేటెస్ట్ గా ఫైట్ మాస్టర్లను కూడా మార్చాల్సి వచ్చిందని టాక్. కేజీఎఫ్ సినిమాకు పనిచేసిన ఫైట్ మాస్టర్లను తీసుకొస్తే.. అవేం పెద్ద ఎఫెక్టివ్‌గా లేవని పక్కనపెట్టారట. సో, ఇప్పటి వరకు తీసిన ఫైట్ సీన్స్ మళ్లీ రీషూట్ చేయాల్సిందే. మొన్నీ మధ్యే ఓ మాల్‌లో షూటింగ్ జరుగుతున్న ఫొటోలు లీక్ అయ్యాయి. అందులో మహేశ్ బాబు, పూజా హెగ్డే కనిపించారు. తీరా ఆ సీన్స్ తీసిన తరువాత… త్రివిక్రమ్ ఎందుకో సాటిస్‌ఫై అవ్వలేదని టాక్. మొత్తానికి అది కూడా స్క్రాప్. బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే… మహేశ్-త్రివిక్రమ్ సినిమా ఇప్పటి వరకు 20 శాతం కూడా పూర్తవలేదు.

మరోవైపు మహేశ్ బాబు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. తాను పక్కా డేట్లతో షెడ్యూల్ ఇచ్చినప్పుడు.. ఫైట్స్, సీన్స్ చూసుకోవాల్సిన బాధ్యత త్రివిక్రమ్‌ది కాదా అని ఒకింత ఫైర్ అయినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ కోరినట్లు డేట్స్ ఇస్తున్నా.. ఇలా షూట్ చేసి ఆ తరువాత వాటిని స్క్రాప్ చేస్తుండడంపై కోప్పడ్డాడని టాక్. పైగా ఔట్ పుట్‌పై అస్సలు రాజీపడడం లేదట ప్రిన్స్. వచ్చేది రాజమౌళి సినిమా కావడంతో… ముందుగానే ఓ పాన్ ఇండియా తరహా సినిమా చేయాలనుకుంటున్నాడు. పైగా త్వరగా ఫినిష్ చేసి రాజమౌళి క్యాంప్‌కు వెళ్లిపోదాం అనుకుంటున్నాడు మహేశ్. కాని, పరిస్థితులు చూస్తుంటే.. అవేమీ అంతగా అనుకూలించడం లేదు. 


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×