BigTV English

Star Singer: అది లేకపోవడం వల్లే విడాకులు పెరుగుతున్నాయి.. సీనియర్ సింగర్ షాకింగ్ కామెంట్..!

Star Singer: అది లేకపోవడం వల్లే విడాకులు పెరుగుతున్నాయి.. సీనియర్ సింగర్ షాకింగ్ కామెంట్..!

Star Singer.. ఒకరకంగా చెప్పాలి అంటే ఈమధ్య వైవాహిక బంధానికి విలువ లేకుండా పోతుందని చెప్పవచ్చు. పెళ్లి అంటే ఏడు అడుగులు, మూడు ముళ్ళు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.. ముఖ్యంగా తాళిబొట్టు కట్టేస్తే పెళ్లి అవుతుంది, తీసేస్తే విడాకులు అంటూ చాలా తేలికగా తీసిపారేస్తున్నారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం వైవాహిక బంధానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ వివాహ బంధాన్ని చిన్న చిన్న కారణాలవల్ల విడిపోయి హేళన చేస్తున్నారని చెప్పవచ్చు.


ప్రేమ లేకపోవడమే యువ జంటల్లో విడాకులకు కారణం..

Star Singer: Divorce is increasing due to lack of it.. Senior Singer's shocking comment..!
Star Singer: Divorce is increasing due to lack of it.. Senior Singer’s shocking comment..!

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఏ చిన్న గొడవ వచ్చినా సరే విడాకులు అంటూ వేరు పడుతున్నారు. వైవాహిక బంధం లో సంవత్సరాల తరబడి సంతోషంగా ఉన్న జంటలు కూడా ఇప్పుడు విడిపోతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే ఇలా వివాహ బంధంలో విడాకులు తీసుకోవడానికి కారణం ఒకటే అని చెబుతున్నారు ప్రముఖ సీనియర్ స్టార్ సింగర్ ఆశాభోస్లే (Asha Bhosle). సింగర్ గా ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె సినీ ఇండస్ట్రీలో యువత ఎక్కువగా విడాకులు వైపు అడుగులు వేయడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చారు. ఆశాభోస్లే మాట్లాడుతూ.. ఈమధ్య కాలంలో చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఇలా విడాకులు తీసుకోవడానికి కారణం భార్యాభర్త మధ్య ప్రేమ లేక పోవడమే. ముఖ్యంగా ప్రేమ లేకపోవడమే యువ జంటల్లో విడాకులకు కారణమని ఈమె తెలిపారు.ఒక కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురు రవిశంకర్ తో మాట్లాడుతూ.. నేను సినిమా పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలు గడిపాను. ప్రస్తుత తరం లాగా గతంలో ఎవరు కూడా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. ముఖ్యంగా యువ జంటల్లో త్వరగా ప్రేమ లేకుండా పోతుందని నేను భావిస్తున్నాను. ఒకరితో ఒకరు విసుగు చెందుతున్నారు. ఇదే విడాకులు పెరగడానికి ఒక ప్రధాన కారణం అంటూ తన మాటగా చెప్పుకొచ్చింది. ఒకరకంగా ఈమె చెప్పింది కూడా వాస్తవమే అంటూ ఈ విషయం నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా భార్యాభర్త ఇద్దరి మధ్య సఖ్యత ఉంటేనే , ఆ బంధం 10 కాలాలపాటు చల్లగా ఉంటుందని, ముఖ్యంగా వైవాహిక బంధం యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని జీవితంలో అడుగులు వేయాలి అని ఈమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ ఉందా మారుతున్నాయి.


ఆశా భోస్లే కెరియర్..

ఆశా భోస్లే విషయానికి వస్తే.. 1943లో ఈమె ప్రస్థానం మొదలైంది. సుమారు 60 ఏళ్ల పాటు కొనసాగిన సినీ ప్రయాణంలో 1000 కి పైగా బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడి పేరు దక్కించుకుంది. ఈమె సోదరీ లతా మంగేష్కర్ కూడా స్టార్ సింగర్ గా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫిలిం నేపథ్య గాయనిగా ఎన్నో అవార్డులు దక్కించుకుంది. ఫిలిం ఫేర్ అవార్డు, నేషనల్ అవార్డు, ఐఫా అవార్డ్స్ ఇలా ఎన్నో అవార్డులు ఈమె సొంతం చేసుకున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×