E-Paper
Advertisement

Double ISMART SteppaMaar : ఇస్మార్ట్ స్టెప్పులతో ‘స్టెప్ప మార్’ సాంగ్ అదిరింది.. ఏంటా జోష్ భయ్యా..

Double ISMART SteppaMaar : ఇస్మార్ట్ స్టెప్పులతో ‘స్టెప్ప మార్’ సాంగ్ అదిరింది.. ఏంటా జోష్ భయ్యా..
Advertisement

Double ISMART SteppaMaar song(Telugu film news): డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్‌ శంకర్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఒక మాస్ యాక్షన్ కంటెంట్‌తో పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ముఖ్యంగా ఇందులో రామ్ పోతినేని మాస్ లుక్, అండ్ లాంగ్వేజ్‌కి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. అంతేకాకుండా సాంగ్స్‌కి బాగా అట్రాక్ట్ అయ్యారు.

బాక్సాఫీసు వద్ద కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ గ్రాండ్ లెవెల్లో రూపొందిస్తున్నాడు. ఇందులో కూడా రామ్ తన మాస్ లుక్‌ను కంటిన్యూ చేయబోతున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రం కోసం ఈ సారి బడా స్టార్‌ను తీసుకువస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ‘కేజీఎఫ్’ విలన్ సంజయ్ దత్ ఈ సినిమా హీరో రామ్‌ను ఢీ కొట్టే పాత్ర చేస్తున్నాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాపై అటు సిని ప్రేక్షకుల్లోనూ ఇటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయింది. మేకర్స్ కూడా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసేశారు.

Also Read: ‘డబుల్ ఇస్మార్ట్’ బర్త్ డే ట్రీట్.. అదరహో అనిపించిన రామ్ పోతినేని!

Advertisement

ఇందులో భాగంగానే డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి ‘స్టెప్ప మార్’ అనే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు ప్రోమోను కూడా రిలీజ్ చేసి అందరిలోనూ ఉత్కంఠ రేపారు. అదే క్రమంలో ఈ స్టెప్ప మార్ ఫుల్ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేసి సినీ ప్రియులకు, అభిమానులకు ఫుల్ ట్రీట్ అందించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ లిరికల్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ ఫుల్ మాస్ లిరిక్స్‌, మాస్ డాన్స్‌ స్టెప్పులతో అదిరిపోయింది. ఈ సాంగ్‌కు మణిశర్మ మాస్ బీట్స్ అందించగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాస్ స్టెప్పులతో అదరగొట్టించాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌‌లో దుమ్ము దులిపేస్తుంది. కాగా ఇందులో రామ్ పోతినేనికి జోడీగా యంగ్ బ్యూటీ కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ అండ్ నటి ఛార్మి కౌర్ కలిసి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్‌లు రానున్నాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×