BigTV English

Rapo’s Double Ismart Teaser:‘డబుల్ ఇస్మార్ట్’ బర్త్ డే ట్రీట్.. అదరహో అనిపించిన రామ్ పోతినేని!

Rapo’s Double Ismart Teaser:‘డబుల్ ఇస్మార్ట్’ బర్త్ డే ట్రీట్.. అదరహో అనిపించిన రామ్ పోతినేని!

Ram Pothineni’s Double Ismart Movie Teaser Out Now: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పటి వరకు ఎలాంటి హిట్లు లేక సతమతమవుతున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలం అవుతున్నాడు. గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద మూవీ చేశాడు. ఈ మూవీ కూడా బోల్తా కొట్టింది. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఇందులో భాగంగానే స్టార్ అండ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ చేస్తున్నాడు.


ఈ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయాన్ని అందించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ అటు రామ్ పోతినేనికి.. ఇటు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రామ్‌కు ఇంత వరకు ఎలాంటి హిట్ లేదు. అలాగే లైగర్‌తో ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరీకి కూడా నిరాశే మిగిలింది. అందువల్లే ఈ మూవీతో వీరిద్దరూ మళ్లీ కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నారు.

ఈ చిత్రం కోసం బడా నటీ నటుల్ని దించుతున్నారు. ఇందులో విలన్ కోసం బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్‌ను రంగంలోకి తీసుకొచ్చారు. అలాగే ఇందులో రామ్‌కు జోడీగా యంగ్ బ్యూటీ కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై ఫుల్ హైప్ పెంచేశాయి. ఇక ఇప్పుడు మరో అప్డేట్‌ అందించిన మేకర్స్ అంచనాలను పెంచేశారు.


Also Read: మాకి కిరికిరి.. పెంచు..పెంచు.. హైప్ ఇంకా పెంచు

ఇవాళ రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇందులో రామ్ పోతినేని స్వాగ్, స్టైల్, మాస్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది. దర్శకుడు పూరి తన మాస్ అండ్ లుక్ మార్క్‌ని ఎక్కడా తగ్గించలేదు. ముఖ్యంగా ఇందులో రామ్ డైలాగ్స్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ముందుగా టీజర్‌లో రామ్ మాస్ లుక్ ఓ లెవెల్లో ఉంది. అలాగే యాక్షన్ సీన్స్ కూడా మరో లెవెల్. రామ్ రోల్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాగే సంజయ్ దత్ పాత్రను కూడా చాలా వైల్డ్‌గా చూపించాడు దర్శకుడు. కత్తులతో వేటాడే సీన్లు మాస్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ కావ్యా కూడా క్యూట్ లుక్‌లో అదరిపోయింది. ఇక రామ్ ఫ్రెండ్‌గా గెటప్ శ్రీను మరోసారి తన కామెడీతో అదరగొట్టేసేలా ఉన్నాడు. మొత్తంగా టీజర్ చూస్తుంటే దీపావళి టపాసుల పండగలా గట్టిగానే పేలింది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో దుమ్ము దులిపేస్తుంది.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×