BigTV English

Sudheer Babu: నన్ను క్షమించండి.. అతను అలాంటివాడని నాకు తెలియదు

Sudheer Babu: నన్ను క్షమించండి.. అతను అలాంటివాడని నాకు తెలియదు

Sudheer Babu: ఇండస్ట్రీ ఎప్పుడు ఎలా ఉన్నా.. ఏదైనా సమస్య వస్తే మాత్రం ఏకం అయిపోతుంది. గత మూడు రోజుల నుంచి సెలబ్రిటీలు సైతం ప్రణీత్ హన్మంతు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ప్రశంసనీయదగ్గ విషయం. ప్రణీత్ హన్మంతు గురించి సోషల్ మీడియా ఎక్కువ ఉపయోగించేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యూట్యూబ్ పెట్టుకొని.. అందులో నలుగురు ఫ్రెండ్స్ ను పెట్టుకొని.. ఒక సినిమా గురించి నెగెటివ్ గా ట్రోల్స్ చేయడం, మీమ్స్ లో వచ్చే టాపిక్స్ ను రోస్ట్ చేసి నవ్వుకోవడం ఇతని పని. ఈ వీడియోలు నచ్చినవారు వారికి లైక్ చేస్తుంటారు.


కొన్ని రోజుల క్రితం ప్రణీత్ హన్మంతు.. అతని స్నేహితులతో కలిసి ఒక మీమ్ వీడియోను రోస్ట్ చేశారు. అందులో తండ్రీకూతుళ్ల బంధానికి నీచమైన సంబంధం అంటకట్టి.. అసభ్యమైన కామెంట్స్ చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో హీరో సాయి ధరమ్ తేజ్.. ఈ వీడియోపై తగిన చర్యలు తీసుకోవాలని, చిన్న పిల్లల వీడియోలు షేర్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరాడు.

ఇక ఈ ట్వీట్ కు మద్దతుగా ఇండస్ట్రీ మొత్తం కదిలివచ్చింది. ప్రతి హీరో.. తేజ్ కు సపోర్ట్ చేస్తూ ప్రణీత్ పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా హీరో సుధీర్ బాబు సైతం తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా తెలిపాడు. ముఖ్యంగా ఆయన ప్రేక్షకులను క్షమాపణలు కోరాడు. ఎవరో తప్పు చేస్తే సుధీర్ ఎందుకు సారీ చెప్పాడా.. ? అని అనుకుంటున్నారా.. ?. ఈ మధ్య సుధీర్ నటించిన హరోంహర సినిమాలో ప్రణీత్ హన్మంతు ఒక పాత్రలో నటించాడు. ఇలాంటివాడు అని తెలియక సినిమాలో నటింపజేసినందుకు సుధీర్ సారీ చెప్పాడు. ఇలాంటివాళ్లను ఊరికే వదలకూడదని కూడా చెప్పుకొచ్చాడు.


” మంచో, చెడో.. నేను సోషల్ మీడియా వ్యక్తిని కాదు. ఇలాంటి విషయాలను అస్సలు క్షమించను. ప్రణీత్ హనుమంతు హరోంహర సినిమాలో నటించినందుకు నేను చాలా అసహ్యంగా భావిస్తున్నాను. దీనికి నేను, నా చిత్ర బృందం తరుపున హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాను. ఈ మనిషి ఇలాంటివాడు అని అసలు తెలియదు. అతని గురించి సోషల్ మీడియా మొత్తం బహిర్గతం చేయడానికి నేను ధైర్యం చేయలేకపోయాను. ఈ జబ్బుపడిన మనస్సులు వారు వ్యాప్తి చేయాలనుకుంటున్న కల్మషానికి వేదిక ఉండకూడదని మనం నిర్ధారించుకోవాలి. ఇది ఏ విధంగానూ వాక్ స్వాతంత్ర్యం కాదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రణీత్ పై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే అతనిని అరెస్ట్ చేయనునున్నట్లు సమాచారం.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×