Parada Movie:అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) .. తెలుగు సినీ ఇండస్ట్రీకి త్రివిక్రమ్ (Trivikram ) దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’ సినిమాతో పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు కథ ఓరియంటెడ్ చిత్రాలను ఎంచుకుంటూ బిజీగా మారిన అనుపమ.. తాజాగా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం పరదా (Parada). ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసులు పీవీ, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా.. ఈవెంట్ కి హాజరైన డైరెక్టర్ ఆసక్తికర కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పేరు కాదు.. డబ్బు ముఖ్యం – డైరెక్టర్
ముఖ్యంగా ఆడియన్స్ కి ఓపెన్ ఛాలెంజ్ విసరడంతో.. ప్రవీణ్ కి అంత కాన్ఫిడెంట్ ఎందుకు? అనుపమ పైన అంత నమ్మకం ఉందా ? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ వేదికగా డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. “నేను దర్శకత్వం వహించిన శుభం, సినిమా బండి రెండు చిత్రాలు ఒకే జోనర్ కి చెందినవి. కానీ ఈ సినిమా నాకు వ్యక్తిగతంగా బిగ్ స్కేల్ ఫిల్మ్స్. వీడు చిన్న సినిమాలు చేసుకుంటూ బతికేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ముగ్గురు స్టార్స్ తో పక్కా కమర్షియల్ సినిమాను తీశాను. ఈ చిత్రానికి మంచి పేరు వస్తుంది. అయితే పేరు మాత్రమే కాదు డబ్బు కూడా రావాలి. ఇలా డబ్బు వస్తేనే ఇలాంటి కంటెంట్ సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు కూడా సిద్ధమవుతారు.
ఆడియన్స్ కి ఛాలెంజ్ విసిరిన డైరెక్టర్..
ముఖ్యంగా అనుష్కకు అరుంధతి ఎలా అయితే బెస్ట్ మూవీగా నిలిచిందో.. అనుపమకి కూడా ఈ సినిమా అదే రేంజ్ లో గుర్తుండిపోతుంది. ఈ సినిమాతో అనుపమ పేరు తప్పకుండా మారుమ్రోగుతుంది. మనకు ఫేవరెట్ మూవీ థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి. ముఖ్యంగా రివ్యూలు బాగుంటేనే మా సినిమా చూడండి. ఇది నా ఛాలెంజ్ “అంటూ అభిమానులకు కూడా ఛాలెంజ్ విసిరారు ప్రవీణ్ కండ్రేగుల. ఇకపోతే ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది.
రివ్యూయర్స్ కి గట్టి ఝలక్..
నిజానికి చాలామంది సినిమా రివ్యూలకు భయపడుతున్న విషయం తెలిసిందే. సినిమా బాగున్నా కూడా బాగాలేదని రాసే రివ్యూయర్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా తన సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని.. రివ్యూలు చూసే సినిమాకు రండి అని డైరెక్టర్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనుపమ నటన పైన కాన్ఫిడెంట్.. ఆయన తెరకెక్కించిన తీరుపై ఉన్న నమ్మకంతోనే డైరెక్టర్ ఛాలెంజ్ విసిరినట్లు సమాచారం.
అనుపమ పరమేశ్వరన్..
అనుపమ కెరియర్ విషయానికి వస్తే.. మలయాళంలో ప్రేమమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన ఈమె.. ముఖ్యంగా శర్వానంద్ తో శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలు చేసింది. ప్రస్తుతం సాయి ధరంతేజ్ సరసన క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై సినిమా చేస్తోంది అనుపమ.
ALSO READ:Hyderabad: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?