World cup 2027: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా ఇటీవల శుభ్ మన్ గిల్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే గిల్ వన్డే ఫార్మాట్ కి కూడా కెప్టెన్ గా మారే అవకాశాలు ఉన్నట్లు తాజా సమాచారం. 2027 లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ స్థానంలో గిల్.. భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వార్త ఇప్పుడు క్రీడా సర్కిల్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Also Read: Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?
తాజాగా ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ కెప్టెన్ గా గిల్ సక్సెస్ అయ్యాడు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 9న యూఏఈ లో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం టీ-20 జట్టులో వైస్ కెప్టెన్ గా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్ ని సెప్టెంబర్ 10వ తేదీన ఆడనుంది. ఈ టోర్నీ ప్రారంభంలోపు సూర్య కుమార్ యాదవ్ ఫిట్ అవుతాడని, అతడు కేప్టెన్ గా వ్యవహరిస్తాడని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో గిల్ ని వైస్ కెప్టెన్ గా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
అయితే ఇప్పుడు గిల్ ని భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా నియమించే విషయం పైనే పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎంతో అనుభవం ఉన్న రోహిత్ శర్మని పక్కన పెట్టి.. గిల్ కి వన్డే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం భావ్యం కాదని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. మరి కొంతమంది మాత్రం యువ నాయకత్వం వైపు మొగ్గు చూపిస్తున్నారు. అలాగే కిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఓ ప్లేయర్ గా కొనసాగడం అతడికి అవమానమేనని అంటున్నారు. ఈ క్రమంలోనే మరో వార్త వైరల్ గా మారింది. రోహిత్ శర్మ వన్డే క్రికెట్ కి గుడ్ బై చెప్పబోతున్నారా..? అనే సందేహాలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ రూమర్స్ పై స్పందించారు. ఫామ్ లో ఉంటే ప్లేయర్లను తొలగించాల్సిన అవసరం లేదని.. ఎవరైతే బాగా ఆడతారో వారే జట్టులో ఉండాలని అన్నారు. ఇటీవల ఓ క్రికెట్ కార్యక్రమంలో పాల్గొన్న సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ” రోహిత్ శర్మ పరిమిత ఓవర్లలో పర్ఫెక్ట్ ఆటగాడు. అయితే రోహిత్ శర్మ వన్డే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న రూమర్స్ పై నాకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు” అని సౌరవ్ గంగూలీ అన్నారు.
Also Read: Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా
ఇదే సందర్భంలో గిల్ గురించి కూడా ప్రస్తావించారు. టెస్ట్ కెప్టెన్సీలో అతడి ప్రదర్శనను ప్రశంసించారు గంగూలి. గిల్ కి లీడర్ షిప్ లో బంగారు భవిష్యత్తు ఉందని.. టీమిండియా వన్డే భవిష్యత్తు గట్టిగానే ఉందని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ చర్చలు మాత్రం ఆగడం లేదు. ఏది ఏమైనా 2027 లో జరిగే వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ ఆడగలగాలంటే.. అతడి ఫిట్నెస్, ఫామ్ పై ఆధారపడి ఉంటుంది.
🚨 Captain in 2027 ODI World Cup 🚨
Shubman Gill is likely to lead Team India in the ODI World Cup 2027. [@VibhuBhola]
📷 PTI pic.twitter.com/caLe51crh3
— CricketGully (@thecricketgully) August 10, 2025