BigTV English

ECL Notification: ఈసీఎల్‌లో 1123 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. మంచి అవకాశం బ్రో

ECL Notification: ఈసీఎల్‌లో 1123 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. మంచి అవకాశం బ్రో

ECL Notification: నిరుద్యోగ అభ్యర్థులు ఈ శుభవార్త మీ కోసమే.. ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) 2025-26 సంవత్సరానికి గానూ గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగాలు, పోస్టులు, విద్యార్హత, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, స్టైఫండ్, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


కేంద్ర ప్రభుత్వ.. కోల్‌ ఇండియా లిమిటెడ్‌ అనుబంధ సంస్థకు చెందిన ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) 2025-26 సంవత్సరానికి గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్ఏటీఎస్) పోర్టల్ ద్వారా నమోదై ఉంటే సరిపోతుంది. సెప్టంబర్ 11న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం వెకెన్సీల సంఖ్య: 1123


ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు..

గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌: 1,123 ఖాళీలు

విభాగాలు/ ట్రేడుల వారీగా ఖాళీలు:

పీజీపీటీ అప్రెంటీస్ పోస్టులు.. (మొత్తం 280)

మైనింగ్ ఇంజినీరింగ్ : 180 పోస్టులు

సివిల్ ఇంజినీరింగ్: 25 పోస్టులు

మెకానికల్ ఇంజినీరింగ్: 25 పోస్టులు

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్: 25  పోస్టులు

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 25 పోస్టులు

పీడీపీటీ (డిప్లొమా అప్రెంటిస్- 843) పోస్టులు

మైనింగ్ ఇంజినీరింగ్: 643 పోస్టులు

సివిల్ ఇంజినీరింగ్: 50 పోస్టులు

మెకానికల్ ఇంజినీరింగ్: 50 పోస్టులు

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్: 50 పోస్టులు

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 50 పోస్టులు

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా పాసై ఉంటే సరిపోతుంది. అప్లై చేసుకోవచ్చు. అయితే ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో రిజిస్ట్రర్‌ అయి ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 11

స్టైఫండ్: సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ ఉంటుంది. నెలకు పీజీపీటీలకు రూ.9వేల స్టైఫండ్ ఉంటుంది. పీడీపీటీలకు రూ.8వేల స్టైఫండ్ ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి).

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.easterncoal.nic.in/

Related News

Clerk Jobs: భారీగా క్లర్క్ పోస్టులు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Big Stories

×