BigTV English

Gift To Jacqueline Fernandez: జాక్వెలిన్ పేరుతో ఓ షిప్ కానుకగా ఇస్తానంటున్న సుఖేశ్

Gift To Jacqueline Fernandez: జాక్వెలిన్ పేరుతో ఓ షిప్ కానుకగా ఇస్తానంటున్న సుఖేశ్

Sukesh Chandrashekhar’s Birthday Gift To Jacqueline Fernandez Yacht ‘Lady Jacqueline’: శ్రీలంకలో పుట్టి పెరిగి భారత్ కు వచ్చి బాలీవుడ్ లో సెటిలయిన బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ప్రస్తుతానికి ఇండియాలోనే స్థిరపడింది. అయితే జాక్వెలిన్ పై వివాదాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రభాస్ నటించిన సాహో మూవీలో ఓ ఐటం సాంగ్ లో నర్తించింది. బాలీవుడ్ అగ్రహీరోల సరసన నటించి మంచి పేరే తెచ్చుకుంది. ఆగస్టు 11న పుట్టినరోజు జరుపుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ బ్యూటీ మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే. జైలులో ఉన్పప్పటికీ సుకేశ్ అనేక సార్లు తన ప్రేయసి జాక్వెలిన్ కు ప్రేమలేఖలు రాసేవాడు.


ప్రేయసికి బర్త్ డే విషెస్

ఆదివారం పుట్టినరోజు జరుపుకున్న జాక్వెలిన్ కు అభినందనలు చెబుతూ మరో లేఖ రాశాడు. ఈ సారి ఆమె పుట్టినరోజున ఏకంగా ఓ పెద్ద షిప్ కానుకగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. దీనిని తాను 2021లోనే ఎంపిక చేశానని చెబుతున్నాడు. పైగా ఆ షిప్ కు లేడీ జాక్వెలిన్ అని పేరు కూడా పెట్టనని అంటున్నాడు. ఇదే నెలలో ఈ షిప్పు జాక్వెలిన్ కు అందేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నానని అంటున్నాడు. అయితే ఈ షిప్పుకు సంబంధించిన కానుకపై న్యాయనిపుణులు, ఆడిటర్లతో సంప్రదింపులు జరిపి అన్ని రకాల పన్నులు కట్టి మరీ జాక్వెలిన్ కు పంపుతున్నానని అంటున్నాడు. అప్పట్లో ఇలా సొంత నౌకలో తాము ఇద్దరం కలిసి ఏకాంతంగా ప్రయాణం చేద్దామని చాలా సార్లు అనుకున్నామని అందుకే ఆ కలని నిజం చేయడానికి తాను ఈ భారీ కానుకను అందజేస్తున్నానని అన్నాడు. అంతేకాదు జాక్వెలిన్ పేరుతో ఆమె అభిమానులకు వంద ఐఫోన్లు కానుకగా ఇస్తున్నానని అంటున్నాడు.


ఆమె సంతోషంగా ఉండాలి

జాక్వెలిన్ ఎప్పటికీ సంతోషంగా ఉండాలని..ఆమె కెరీర్ అత్యద్భుతంగా సాగిపోవాలని..ఆమె మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.అలాగే జాక్వెలిన్ పేరిట కేరళలో వయనాడ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన విపత్తులో నివాసాలు కోల్పోయిన పేదవారికి రూ.15 కోట్ల తో ఇళ్లు కట్టించి ఇస్తానని ప్రకటించాడు సుకేశ్. జాక్వెలిన్ కు మొదటినుంచి ప్రేమ కానుకలపై ఇంటరెస్ట్ లేదని..ఇలాంటి సామాజిక అంశాలంటేనే ఆమె ఇష్టపడతారని..సమాజ సేవ గురించే ఆమె ఎప్పుడూ ఆలోచిస్తుంటారని సుకేశ్ తెలిపాడు. రూ.200 కోట్ల నగదు చెలామణిలో మనీల్యాండరింగ్ కేసు ఎదుర్కొంటున్న సుకేష్ 2015 నుంచి ఢిల్లీలోనే ఉన్నాడు. సుకేశ్ పై చాలా ఆర్థిక లావాదేవీల కేసులు ఉన్నాయి. దీనితో ఆయనకు బెయిల్ దొరకడం కూడా కష్టంగా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×