BigTV English

Mohammed Siraj: డ్రీమ్స్‌లో సిరాజ్ తొలి అడుగు, ల్యాండ్ రోవర్ కారు కొనుగోలు, జాబితా ఇంకా..

Mohammed Siraj: డ్రీమ్స్‌లో సిరాజ్ తొలి అడుగు, ల్యాండ్ రోవర్ కారు కొనుగోలు, జాబితా ఇంకా..

Mohammed Siraj: హైదరాబాద్‌కు చెందిన టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్ తన డ్రీమ్‌ని నెర వేర్చుకునే పనిలో పడ్డాడు. తాజాగా తన కెంతో ఇష్టమైన ల్యాండ్ రోవర్‌కారును కొనుగోలు చేశాడు ఈ ఆట గాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు.


కొనుగోలు చేసిన కొత్త కారుతో ఫోటోలకు ఫోజు లిచ్చాడు. దేవుడి ఆశీర్వాదంతో తన కలల కారును కొనుగోలు చేసినట్టు తెలిపాడు. ఈ కారును తన ఫ్యామిలీ కోసం కొన్నట్లు వెల్లడించాడు. మీ డ్రీమ్స్‌పై ఎలాంటి పరి మితులు ఉండవని, ఎందుకంటే అవి మిమ్మల్ని మరింత కష్టపడి పని చేస్తాయన్నాడు.

నిలకడతో మీరు చేసే ప్రయత్నమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందన్నాడు.నా కలల కారు కొనుగోలు చేసినందుకు సర్వ శక్తిమంతుడైన దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు. సిరాజ్ మనసులో దాదాపు అరడజను డ్రీమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకొక్కటిగా వాటిని పూర్తి చేసే పనిలోపడ్డాడు.


Mohammed Siraj buys a Land Rover car
Mohammed Siraj buys a Land Rover car

ఇటీవల వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది టీమిండియా. జట్టులోని మహమ్మద్ సిరాజ్ సభ్యుడు. కప్ గెలిచిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి.. సిరాజ్‌ను సన్మానించారు. అత్యుత్త మ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు ఈ క్రికెటర్. అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం తరపున ఉద్యోగంతోపాటు ఇంటి స్థలం కేటాయించనుంది.

Related News

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

Big Stories

×