E-Paper
Advertisement

Sukumar: నా మతి పోయింది దసరా చూశాక.. సుకుమార్ ప్రశంసలు

Sukumar: నా మతి పోయింది దసరా చూశాక.. సుకుమార్ ప్రశంసలు
Advertisement

Sukumar: నేచురల్ స్టార్ నాని హీరోగా కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తాజా చిత్రం దసరా. పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బద్దలు కొడుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాపై దిగ్గజ దర్శకుడు సుకుమార్ ప్రశంసలు కురిపించారు. తన శిష్యుడు శ్రీకాంత్ ఓదెల సినిమా తెరకెక్కించిన విధానం చూసి ఆనందంతో మురిసిపోయారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘‘దసరా సినిమా చూశాక నా హృదయం సంతోషంతో నిండిపోయింది. వీర్లపల్లి ప్రపంచంలోకి శ్రీకాంత్ ఓదెల నన్ను తీసుకెళ్లాడు. అతని విజువల్ నరేషన్ అద్భుతం. నా మతి పోయింది. ధరణి పాత్రలో నాని, వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టారు. దసరా సినిమా బృందానికి నా అభినందనలు’’ అంటూ రాసుకొచ్చారు సుకుమార్.

Advertisement

ఇక సుకుమార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇకపోతే ఒక్క సుకుమారే కాదు.. యావత్ సినీ ఇండస్ట్రీ దసరా మూవీపై ప్రశంసలు కురిపిస్తోంది. దర్శకుడు తెరకెక్కించిన విధానం.. నాని, కీర్తి సురేష్‌ల నటనను పొగుడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×