BigTV English

Google:- గూగుల్ ఉద్యోగులకు మరో షాక్.. అవన్నీ కట్..

Google:- గూగుల్ ఉద్యోగులకు మరో షాక్.. అవన్నీ కట్..

Google:- లేఆఫ్స్ అనేవి ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు పీడకలగా మారాయి. సీనియర్ ఉద్యోగులు సైతం ఉద్యోగం నుండి ఎప్పుడు తొలగిస్తారో అన్న భయంతో జీవిస్తున్నారు. ఇక ఒకవైపు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో లేఆఫ్స్ ఊపందుకుంటుంటే.. మరోవైపు ఉద్యోగులకు వచ్చే ఇతర సౌకర్యాలకు కూడా చెక్ పెట్టాలని గూగుల్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అతిపెద్ద టెక్ కంపెనీ అయిన గూగుల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇతరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


ఇప్పటికే గూగుల్ కాస్ట్ కటింగ్ మీద ఫుల్‌గా ఫోకస్ పెట్టింది. అనవసరమైర డిపార్ట్‌మెంట్స్‌ను తొలగిస్తూ.. అవసరమైన ఉద్యోగులను మాత్రమే ఉద్యోగం నుండి తొలగించకుండా కొనసాగిస్తూ.. ఎన్నో మార్పులను ప్రారంభించింది గూగుల్. తాజాగా మరో కొన్ని విషయాలలో కూడా మార్పులు తీసుకురావడానికి గూగుల్ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం గూగుల్‌లో పనిచేసే ఉద్యోగులకు ఫ్రీగా స్నాక్స్ అందించేవారు. ఇకపై అవి ఉండవని తెలుస్తోంది. దాంతోపాటు ఉద్యోగులకు వర్కవుట్ క్లాసెస్ కూడా ఉండవని నేషనల్ మీడియాలో ప్రచారం కొనసాగుతోంది.

గూగుల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బ్రాంచులు ఉన్నాయి. ఆయా బ్రాంచ్‌ల పర్ఫార్మెన్స్‌ను బట్టి వారికి సౌకర్యాలు లభిస్తాయని గూగుల్ ఛీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ రుత్ పోరాట్ ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటివరకు దాదాపు గూగుల్‌కు చెందిన అన్ని బ్రాంచ్‌లలో సీరియల్, కాఫీ, నీళ్లు లాంటి వాటితో పాటు పలు ఫ్రీ స్నాక్స్ ఉద్యోగులకు అందుబాటులో ఉండేవి. ఇకపై ఉద్యోగులు తక్కువగా వచ్చిన రోజుల్లో స్నాక్స్ అందించడం కుదరదని గూగుల్ తేల్చేసింది. ఇక ఫిట్‌నెస్ క్లాస్‌ల విషయంలో కూడా ఇలాంటి మార్పే రానుంది.


ఇప్పటివరకు గూగుల్ తమ ఉద్యోగులకు ల్యాప్‌టాప్ సౌకర్యాన్ని అందించేంది. ఇకపై అలాంటి కూడా అందించకపోవచ్చని గూగుల్ ప్రకటనలో తెలిపింది. కేవలం గూగుల్‌లో ఉద్యోగులకు అత్యవసరమయ్యేవి, కంపెనీ మెరుగుదలకు పనికొచ్చే విషయాల్లో మాత్రమే ఫండ్స్‌ను ఖర్చు పెట్టాలని గూగుల్ బలంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా రీక్రూట్మెంట్ విషయంలో కూడా గూగుల్ మార్పులు చేయనుంది. ఉన్న ఉద్యోగులతోనే హై క్వాలిటీ వర్క్ చేయించుకోవాలని అనుకుంటోంది.

మామూలుగా గూగుల్ ఆఫీసులు చాలా పెద్దగా, విశాలంగా ఉంటాయి. కానీ ఈమధ్య వాటిని కూడా చిన్నగా మార్చడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు ఉద్యోగులు తమ డెస్క్ స్పేస్‌ను షేర్ చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 20న గూగుల్ సీఈఓ సుందర్ పిచై 12 వేల ఉద్యోగులకు లేఆఫ్ దెబ్బ తప్పదని ప్రకటించారు. పలువురు సీనియర్ ఉద్యోగులకు పెద్ద పోస్టులు ఇస్తూ.. ఇప్పటికే పలువురిని లేఆఫ్ పేరుతో ఉద్యోగం నుండి తొలగించింది గూగుల్.

సూర్యుడి నుండి జ్వాల.. టెక్నాలజీలపై ఎఫెక్ట్..

for more updates follow this link:-Bigtv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×