E-Paper
Advertisement

Sukumar writings : సుకుమార్ స్క్రీన్ ప్లే అంటే అట్లుంటది మరి.. విరూపాక్ష ట్విస్ట్ సుక్కూ క్రియేషనే..!

Sukumar writings : సుకుమార్ స్క్రీన్ ప్లే అంటే అట్లుంటది మరి.. విరూపాక్ష ట్విస్ట్ సుక్కూ క్రియేషనే..!
Advertisement
Sukumar writings

Sukumar writings(Latest Tollywood News) : విరూపాక్ష సినిమా హిట్‌కి మెయిన్ రీజన్ క్లైమాక్స్. అదిరిపోయే సస్పెన్స్ అండ్ ట్విస్ట్‌తో సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. సినిమా చూస్తున్నంత సేపు.. విలన్ ఎవరనేది ఒక్కొక్కరు ఒక్కోలా గెస్ చేసేలా చేశారు. సినిమా చివరి వరకు విలన్ హీరోయినే అని తెలియకుండా బాగా లాక్కొచ్చారు. అసలు సినిమా స్టార్టింగ్‌లోనే హీరోయిన్ నల్ల కోడిని ఎత్తుకెళ్లినప్పుడే అనుమానించాల్సిందని ఇప్పుడు మీమ్స్ పెడుతున్నారు.

Advertisement

ఏదేమైనా ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్‌ది కాదు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ఇచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్‌ది. సినిమా డైరెక్టర్ ఈ మధ్యే దీనికి సంబంధించిన సీక్రెట్ బయటపెట్టాడు. ఈ సినిమాలో విలన్‌గా యాంకర్ శ్యామలను అనుకున్నాడు డైరెక్టర్. అయితే, ఆ క్యారెక్టర్‌ను విలన్‌ను చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదని చెప్పాడట సుక్కూ. హీరోయిన్‌నే విలన్‌ను చేస్తే ప్రేక్షకులు థ్రిల్ అండ్ సస్పెన్స్ ఫీల్ అవుతారని చెప్పుకొచ్చాడు. సుకుమార్ చెప్పిన తరువాత ఇక అందులో తిరుగేముంటుంది. ఆ లైన్ డైరెక్టర్‌తో పాటు హీరో, హీరోయిన్లకు నచ్చింది. దీంతో స్క్రిప్టులో భారీ మార్పులు చేసి, కొన్ని సీన్లను మళ్లీ రీషూట్ చేసి మరీ కథను, క్లైమాక్స్‌ను మార్చారు. దాని రిజల్ట్ సిల్వర్ స్క్రీన్‌పై అదిరిపోయింది.

ఒకవేళ యాంకర్ శ్యామలనే మెయిన్ విలన్‌ను చేసి ఉంటే.. అంత ఎఫెక్టివ్‌గా ఉండేది కాదు. ఓస్.. ఈమెనా విలన్ అనుకుని బయటికి వచ్చేస్తారు తప్ప అంత ఎగ్జయిటింగ్‌గా ఫీల్ అవరు. హీరోయిన్‌ను విలన్ చేసి, అందులోనూ ప్రేమను మిక్స్ చేసే సరికి.. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారు. ఇది కాకుండా వేరే ఏ క్లైమాక్స్ తీసినా సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. మొత్తానికి సుకుమార్ సరైన సమయంలో వేలు పెట్టి, గట్టి స్క్రీన్ ప్లే అందించి.. డైరెక్టర్‌కూ, ఇటు తేజ్‌కు, హీరోయిన్ సంయుక్తకు భారీ హిట్ ఇచ్చాడు. అన్నట్టు విరూపాక్ష డైరెక్టర్ .. సుక్కూ శిష్యుడే కావడంతో స్పెషల్ ఇంట్రస్ట్ తీసుకున్నాడు. 

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×