BigTV English

 Director Teja : డైరెక్టర్ తేజ చెయ్యేస్తే…? హీరోయిన్లకు తిరుగుతుందా?

 Director Teja  : డైరెక్టర్ తేజ చెయ్యేస్తే…? హీరోయిన్లకు తిరుగుతుందా?
Director Teja


Director Teja latest movie updates(Celebrity news today) : గీతిక తివారి. తేజ లేటెస్ట్ హీరోయిన్. దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరామ్ హీరోగా సినిమా తీస్తున్నాడు డైరెక్టర్ తేజ. టాప్ ప్రొడ్యూసర్ తన కుమారుడిని పెద్దగా సక్సెస్ లేని తేజ లాంటి డైరెక్టర్ చేతిలో పెట్టడమే ఓ వండర్. పైగా అహింస అనే టైటిల్ కూడా ఏమంత ఇంప్రెసివ్‌గా లేదు. అయినా, కంటెంట్ ఉన్న సినిమాకి టైటిల్‌తో పనిలేదని చాలా సినిమాలు నిరూపించాయి. కాకపోతే, ఓ టాప్ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో అనగానే.. యాక్షన్ సీక్వెన్సెస్‌తో నింపిన సినిమాతోనే ఎంట్రీ ఉంటుంది. అలా కాకుండా.. Director Teja మార్క్‌తో వస్తోంది అహింస.

ఇక ఈ సినిమాపై మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌కు చెందిన గీతిక తివారి భారీ ఆశలే పెట్టుకుంది. సినిమా ఎలా ఉన్నా.. తేజ కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో, హీరోయిన్లకు మంచి క్రేజ్ ఉంటుంది. రీమాసేన్, సదా, అనిత… ఈ హీరోయిన్లు ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలారు. రీమాసేన్, సదా కోలీవుడ్‌లోనూ సత్తా చాటారు. ఇక కాజల్ గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌ను ఓ ఊపు ఉపేసింది. ఆ తరువాత కోలీవుడ్‌లోనూ సత్తా చాటి బాలీవుడ్‌కి వెళ్లింది. ఉదయ్ కిరణ్, నితిన్‌కు కూడా స్టార్ డమ్ వచ్చింది. సో, ఒకరిద్దరు తప్ప Teja చేతిలో పడితే మంచి షైనింగ్ ఉంటుందన్నది నిజం. అందుకే, Director Teja హ్యాండ్‌పై భారీ ఆశలు పెట్టుకుంది గీతికా తివారీ. ఈ సినిమాతో తన ఫేట్ మారిపోతే.. అప్‌కమింగ్ హీరోయిన్‌గా ఛాన్సులు కొట్టేయాలని చూస్తోంది.


అసలే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అర్జెంటుగా హీరోయిన్లు కావాలి. ఔట్ డేటెడ్ అయిపోయి, ఐరన్ లెగ్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లే ఎక్కువ మంది ఉన్నారు. సో, టాలీవుడ్‌లో ఉన్న ఈ గ్యాప్‌ను ఆపర్చునిటీగా అందిపుచ్చుకోవాలనే ఆశతో ఉంది గీతికా తివారీ. పైగా తేజ సినిమాలో హీరోయిన్లకు యాక్టింగ్ స్కోప్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. సో, ఫస్ట్ అటెంప్ట్‌లోనే టాప్ ప్రొడ్యూసర్ల దృష్టిలో పడితే ఇక తిరుగు ఉండకపోవచ్చు. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×