E-Paper
Advertisement

Golden Visa for Rajinikanth: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రజినీకాంత్.. యూఏఈ నుండి గోల్డెన్ వీసా..

Golden Visa for Rajinikanth: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రజినీకాంత్.. యూఏఈ నుండి గోల్డెన్ వీసా..
Advertisement

Rajinikanth Received Golden Visa from UAE: ప్రముఖ సినిమా హీరో రజినీకాంత్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) గోల్డెన్ వీసాను రజినీకాంత్ తాజాగా అందుకున్నారు. దీంతో ఆయన ఈ వీసాను అందుకున్నవారి జాబితాలోకి చేరారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూఏఈ గోల్డెన్ వీసాను తనకు రావడం పట్ల ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు. ఈ నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వానికి, తన స్నేహితుడైన యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆతను లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు.

అయితే, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు, పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులకు యూఏఈ ఈ ప్రత్యేక వీసా అయినటువంటి గోల్డెన్ వీసాను అందజేస్తోంది. ఈ వీసాను 10 ఏళ్ల కాలపరిమితితో అందజేస్తుంది. ఈ క్రంలో రజినీకాంత్ కు ఈ వీసాను అందించింది. కాగా, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్ లాల్, మమ్ముట్టి, టొవినో థామస్, షారుక్ ఖాన్ కు ఈ వీసా లభించిన విషయం తెలిసిందే.

Advertisement

Also Read: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఎమ్మెల్యేగా గెలిచినా ఆ పని చేయనున్న పవన్.. ?

‘జైలర్’ మూవీలో రజినీకాంత్ నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేట్టయాన్ మూవీలో ఆయన నటిస్తున్నారు. ఆయనకు ఇది 170వ చిత్రం. అదేవిధంగా ‘కూలీ’ సినిమాలో కూడా ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×