BigTV English

Good News for Pawan Fans: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఎమ్మెల్యేగా గెలిచినా ఆ పని చేయనున్న పవన్..?

Good News for Pawan Fans: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఎమ్మెల్యేగా గెలిచినా ఆ పని చేయనున్న పవన్..?

Good News for Pawan Kalyan Fans: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఏపీ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగాయి. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేసిన విషయం తెల్సిందే, అందరూ ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసమే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ గెలిచినా కూడా సినిమాలు వదిలే ప్రసక్తి లేదని తెలుస్తోంది.


ఎన్నికల కారణంగా పవన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ప్రచారంలో బాగా అలిసిపోవడంతో కొద్దిగా రెస్ట్ మోడ్ లోకి వెళ్ళాడు. ఈ రెస్ట్ మోడ్ అవ్వగానే సెట్స్ లో ప్రత్యక్ష్యం కానున్నాడు పవన్. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. OG, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. మూడు సినిమాలు ఫినిష్ కాలేదు. ఈ మూడు సినిమాలను ఫినిష్ చేస్తే తప్ప పవన్.. సినిమాలకు బ్రేక్ తీసుకోలేడు. ఈ సినిమాల నుంచి వచ్చిన డబ్బుతోనే పవన్ జనసేన పార్టీని నడిపిస్తున్నాడు. దానికోసమే తాను సినిమాలు చేస్తున్నాను అని ఆయనే అధికారికంగా తెలిపాడు.

ఇక పవన్ ఎమ్మెల్యేగా గెలిస్తే సినిమాలకు పూర్తిగా దూరమవుతాడని ఎప్పటినుంచో అభిమానుల్లో ఒక అనుమానం ఉండేది. అయితే ఆ అనుమానం నిజం కాదని తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ మూడు సినిమాలు కాకుండా పవన్ మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేసాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు కుర్ర డైరెక్టర్లు.. తమ కథలతో పవన్ ను మెప్పించారని సమాచారం.


Also Read: Satyabhama Trailer: కాజల్ నటవిశ్వరూపం.. సత్యభామ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ చూశారా..?

అంటే మరో రెండు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. ఈ మూడు సినిమాలు షూటింగ్ అయ్యేసరికి ఈ ఏడాది పట్టినా.. కొత్త సినిమాలు మొదలయ్యేసరికి కొత్త ఏడాది రానేవస్తుంది. అంటే పవన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనట్టే. ఈ విషయం తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×