BigTV English
Advertisement

Lal Salaam OTT Release Date: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న రజనీకాంత్ సినిమా లాల్ సలామ్..?

Lal Salaam OTT Release Date: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న రజనీకాంత్ సినిమా లాల్ సలామ్..?
, latest news in tollywood

Lal Salaam OTT: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సలాం’. ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను చేరుకోవడంలో విఫలం అయింది. ఫిబ్రవరి 9న తమిళంలో రిలీజైన ఈ మూవీ ఏమాత్రం ఆడియన్స్ మనసులు దోచుకోలేకపోయింది. ఎవరూ ఊహించని రీతిలో డిజాస్టర్‌గా మిగిలింది.


ఇక తెలుగులో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలుగా చేసిన ఈ మూవీకి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. క్రికెట్‌తో పాటు మతాల అంశాలతో తెరకెక్కిన ఈ మూవీలో రజనీ కాంత్ మొయిద్దీన్ భాయ్‌గా నటించారు.

ఈ మూవీ విడుదలైన ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ అందుకుంది. దీంతో ఈ మూవీ చూసేందుకు ప్రేక్షకాభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపించలేదు. ఈ మేరకు సూమారు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి గానూ మొత్తంగా రూ.25 కోట్లలోపే కలెక్షన్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది.


Read More: మెంటలెక్కిస్తున్న రజనీకాంత్ రెమ్యునరేషన్..‘లాల్ సలాం’ కోసం నిమిషానికి కోటి!

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ ఆయనకు కోలుకోలేని నష్టాలను మిగిల్చిందనే చెప్పాలి. ఇక ఈ మూవీ అందరి అంచనాల కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

దీంతో ఈ మూవీ నెలలోపే అంటే.. మార్చి మొదటి వారంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.

Read More: లాల్ సలాం రివ్యూ.. రజనీకాంత్‌ది ప్రత్యేక పాత్రనా? ఫుల్ లెంత్ పాత్రనా?

ఈ మూవీలో లివింస్టన్ సెంథిల్, విఘ్నేష్, జీవిత రాజశేఖర్, వివేక్ ప్రసన్న, తంబి రామయ్య కీరోల్స్ చేసి మెప్పించారు. అలాగే ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×